గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి : సత్రం రామకృష్ణుడు
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అర్హత ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని త్వరలో జరగబోయే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కర్నూల్ పట్టణం నందు చిత్తారి గిరి 5 వ వార్డు ఇన్చార్జ్ బాలు గారు టౌన్ టిడిపి బీసీ సెల్ నాయకులు విజయలక్ష్మి అయ్యత్ బీ, సుశీలమ్మ, కిట్టు లతో కలిసి గ్రాడ్యుయేట్ ఓటు ఉచిత నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. దాదాపుగా 32 మంది దాకా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించడం జరిగినది. ఓటు నమోదు కార్యక్రమం నవంబరు7వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగుతుంది. ఓటు నమోదుకు కావలసిన డిగ్రీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటోతో తమ తమకు ఇస్తే ఓటు నమోదు ప్రక్రియ సులభంగా పూర్తి చేస్తామని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని పట్టభద్రుల తరపున ఓ మంచి ఎమ్మెల్సీ ని ఎన్నుకునే అవకాశాన్ని పొందాలి, అలాగే గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించుకోవాలనుకున్నవారు తమ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఫోటో ఓటర్ కార్డు తదితర వివరాలను ఫోటో తీసి వాట్సాప్ నెంబర్ కు పంపిన కూడా మీ గ్రాడ్యుయేట్ ఓటును ఆన్ లైన్లో నమోదు చేయబడుతుంది.