పెన్నానదిలో భారీగా నీటి ప్రవాహం..
1 min read– 55 వేల క్యూసెక్కుల వరద నీరు సోమశిల ప్రాజెక్టులోకి
పల్లెవెలుగు ,వెబ్ చెన్నూరు: కడప కర్నూల్ అనంతపురం జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నా నది. కుందు. పాపాగ్ని. చిత్రావతి. నదులు ఉదృతంగా ప్రవహిస్తున్న డంతో చెన్నూరు వద్ద పెన్నా నది లో గురువారం సాయంత్రానికి 55 వేల క్యూసెక్కులు వరద నీరు పెన్నా నది దిగువనున్న సోమశిల ప్రాజెక్టు లోకి చేరుతున్నది. చెన్నూరు పైభాగంలో వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి పెన్నా నది పై నిర్మించిన ఆనకట్ట వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతున్న ది. జమ్మల మడుగు సమీపంలో మైలవరం జలాశయం గేట్లు పూర్తిగా ఎత్తివేయడం. కుందు నది. పాపాగ్ని నది నుంచి పెన్నా నదుల కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గురువారం రాత్రికి పెన్నా నది లో భారీగా నీటి ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెన్నూరు వద్ద పెన్నా నది లో సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ అధికారులు సిబ్బంది నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. పెన్నా నది లో భారీగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో చెన్నూరు మండల అధికారులు వీఆర్ఏ వీఆర్వో లలో అప్రమత్తం చేశారు.