టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ గుడ్ బై
1 min readపల్లెవెలుగువెబ్: మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్…అందుకు విరుద్ధంగా పార్టీ అధిష్ఠానం టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చింది. ఈ పరిణామంతో అసంతృప్తి వ్యక్తం చేసిన నర్సయ్య గౌడ్‌ను ప్రగతి భవన్‌కు పిలిపించిన కేసీఆర్ ఆయనను బుజ్జగించారు. ఈ క్రమంలో గురువారం ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలుకు కూడా నర్సయ్య హాజరయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన నర్సయ్య గౌడ్… బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్‌తో భేటీ అయినట్లు సమాచారం. బీజేపీలోకి నర్సయ్య గౌడ్ ఎంట్రీకి తరుణ్ చుగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… అదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా చేరవేసినట్లు సమాచారం. తాజాగా శుక్రవారం రాత్రి నర్సయ్య గౌడ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సమాచారం. అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన బీజేపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.