PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారులను దిగ్బందనం చేస్తాం..!

1 min read

– ప్రభుత్వానికి సిపిఎం హెచ్చరిక.
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: జిల్లాలో పాడైపోయిన రోడ్లను తక్షణమే మరమ్మత్తులు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజానీకాన్ని సమీకరించి అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులను దిబ్బందనం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈరోజు జిల్లావ్యాప్తంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాడైపోయిన రోడ్లను మరమత్తులు చేయాలని, కొత్త రోడ్లు నిర్మించాలని, తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ అన్ని పట్టణ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి జిల్లాలో ఏ ఒక్క రహదారిని పునరుద్ధరించలేదని, మరమత్తులు చేపట్టలేదని, కొత్త రోడ్ల నిర్మాణం చేయలేదని ఆయన విమర్శించారు. జిల్లాలో అన్ని ఎమ్మెల్యేల స్థానాలు, ఎంపీ స్థానాలకు వైసీపీకి ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తే అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లా ప్రజానీకానికి గుంతల రోడ్లు బహుమానంగా ఇచ్చిందని ఆయన ఘాటుగా విమర్శించారు. గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? ప్రజల గోడు పట్టదా ప్రజల జీవన పరిస్థితి పట్టదా ? ప్రజలు ఎక్కడా ప్రయాణం చేయకూడదా సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. కర్నూలు జిల్లా నుండి ఆదోని ఎమ్మిగనూరులకు ప్రజలు వెళ్లాలన్న తిరిగి కర్నూలు కి రావాలన్నా అనేక అవస్థలు పడాల్సి వస్తుందని, ఎమ్మిగనూరు నుండి కోడుమూరు వరకు 40 కిలోమీటర్ల రోడ్డు అడుగడుగునా గుంతలు పడుతున్నా, అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాి, స్థానిక ప్రజాప్రతినిధులు గాని జిల్లా కలెక్టర్ గారిని కనీసం గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా చేయలేదంటే ఈ జిల్లా ప్రజానీకం పట్ల, ప్రజల రవాణా పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా కేంద్రం నుండి సుంకేసుల మీదుగా మంత్రాలయం వరకు, అలాగే గూడూరు మండలం పోల్కల్ నుండి ఎమ్మిగనూరు వరకు, ఎమ్మిగనూరు నుండి జాలవాడి వరకు ఆదోని మండలం మధ్యలో బైచికేరి నుండి కల్లుకుంట వరకూ, పత్తికొండ నుండి మద్దికేర వరకు, కోసిగి నుండి మాలపల్లి వరకు రోడ్లన్నీ గుంతల మయమై ప్రజలు ప్రయాణం చేయడానికి అనేక అవస్థలు పడుతున్నారని వీటిని మనవత్తులు చేయడానికి తక్షణమే నిధులు మంజూరు చేసి కొత్త రోడ్లు నిర్మించాలని, అలాగే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ నడిబొడ్డున పాత కల్లూరు కర్నూల్ కు మధ్యలో వక్కెర వాగు బ్రిడ్జి శిలావస్థలో ఉన్నప్పటికీ దానిని ఎత్తు పెంచి నిర్మించాలననే కనీస ఇంకిత జ్ఞానం కూడా ప్రజాప్రతితులు లేకపోవడం దురదృష్టమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఇన్చార్జి మంత్రి గారు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుండి రోడ్ల నిర్మాణం కోసం, మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేపట్టకపోతే రాబోయే కాలంలో రహదారులు దిగ్బంధనం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ధర్నాకు హాజరైన ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్న రాకున్నప్పటికీ కలెక్టర్ కార్యాలయం గేట్ల ముందు బైఠాయించాల్సి వచ్చింది. ఏవో గారు వచ్చిన తర్వాత ఏవో గారికి వినతిపత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమాన్ని ముగించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఆనంద్ బాబు, సుభాన్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు విజయ్, షరీఫ్, అబ్దుల్లా, రామకృష్ణ, కృష్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

About Author