ఘనంగా గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే…
1 min readఎంపీడీవో మోహన్ కుమార్, ఈవో ఆర్ డీ కవిత
పల్లెవెలుగు, వెబ్ ఆత్మకూరు: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. చేతులు శుభ్రంగా లేకపోతే దానికి ఉండే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తాయి.దీని కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడంలో ప్రాముఖ్యతను చెప్పడానికి ‘గ్లోబల్ హ్యాండ్ వాష్ డే’ను నిర్వహిస్తున్నారు. శనివారం మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామ సచివాలయం నందు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ కుమార్ మరియు ఈవో ఆర్ డి కవిత గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బైర్లూటి వైద్యాధికారి పాల్గొని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే గురించి వివరించారు. అనంతరం అమలాపురం గ్రామంలోని అంగనవాడి కేంద్రం ను తనిఖీ చేశారు.