PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీకి మరో తుఫాన్ ముప్పు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీకి పెను తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది క్రమేపీ బలపడి 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి ఏపీ దిశగా వస్తుందని, ఈ క్రమంలో అది తుపానుగా, పెను తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, తుపానుగా మారితే దీనిని ‘సిత్రాంగ్’ అని పిలుస్తారని వెల్లడించింది. ఇది సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వివరించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ‘సిత్రాంగ్’ అనే పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో ‘సిత్రాంగ్’ అంటే ‘వదలనిది’ అని అర్ధం.

                 

About Author