PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్‌ రైతు భరోసా..ఖాతాల్లో జమ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత కార్యక్రమానికి హాజరైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సభలో అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత పెట్టుబడి సాయం కింద నంద్యాల జిల్లాలోని 2,20, 497 మంది రైతులకు రూ.96.45 కోట్ల లబ్ది చేకూరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సోమవారం ఉదయం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. స్వాగత కార్యక్రమం అనంతరం ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలు దేరి ఆళ్లగడ్డలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ఉదయం 10:45 గంటలకు దిగి, కాన్వాయ్ లో ఉదయం 11:25 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకున్నారు.ఆళ్లగడ్డకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రత్యేక కాన్వాయ్ ఇరువైపులా రహదారి వెంబడి పెద్ద సంఖ్యలో వేచి ఉన్న ప్రజలు అభివాదం చేశారు. ఆళ్లగడ్డకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రావడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు బారులు తీరి సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిలకించారు. రోడ్డుకిరు వైపులా తనను చూడడానికి బారులుతీరి వేచి ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవ్వుతూ, నమస్కరిస్తూ కాన్వాయ్ లో ముందుకు సాగటంతో ప్రజలు కూడా ప్రతి నమస్కారం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్‌ బాషా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథ రెడ్డి, ఇషాక్‌ బాషా, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోర్దినేటర్ తలశిల రఘురాం, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంవిఎస్ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

About Author