బ్రిటన్ ప్రధాని రాజీనామా
1 min readపల్లెవెలుగువెబ్ : బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తానిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ తాను ప్రధాని పదవిలో కొనసాగుతానని తెలిపారు. లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని పదవి చేపట్టిన 6 వారాల్లోనే లిజ్ ట్రస్ వివాదాల్లో చిక్కుకున్నారు. తొలిసారి ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్‌లో పేదలకు, సంపన్నులకు సమానంగా ఇంధన రాయితీలు ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మూడు రోజులుగా మౌనంగా ఉన్న ట్రస్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘‘తప్పులు చేశాం.. మన్నించండి’’ అని క్షమాపణలు చెప్పారు.