PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహసిల్దార్ కు (ఏపీడబ్ల్యూజేఎఫ్) వినతి

1 min read

– ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: పట్టణంలో.జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దయ్య యాదవ్, బనగానపల్లె డివిజన్ ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఆంధ్రజ్యోతి విలేఖరి వెంకటేశ్వర్లు లు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రామకృష్ణకు కర్నూలు జిల్లా పత్తికొండ ఏబీఎన్ విలేకరి పక్కిరన్న పై దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం దారుణం అన్నారు. పత్తికొండలో ఎర్ర మట్టి మాఫియా పై ఏబీఎన్ ఛానల్ లో ప్రసారం చేసినందుకు దాడి చేయడం సమంజసం కాదన్నారు దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. పోలీసులు జర్నలిస్టులపై దాడి జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులపై తిరిగి దాడులు పునవృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ బనగానపల్లె డివిజన్ కార్యదర్శి షాషావలి, సీనియర్ జర్నలిస్టులు ఈనాడు వెంకటరాముడు ,రఘురామిరెడ్డి, జర్నలిస్టులు ప్రజాశక్తి చంద్రశేఖర్, పల్లె వెలుగు. మహబూబ్ బాషా ఏబీఎన్ రమణ, టీవీ9 జోహార్, హెచ్ఎంటీవీ రమణ, టివి5 సుబ్బయ్య, ఈనాడు నగేష్, నేను సైతం మధు, సిటీ కేబుల్ రఘురామిరెడ్డి, అవుకు ఆంధ్రజ్యోతి విలేకరి పుల్లయ్య , టీవీ 55 సయ్యద్, తేజ న్యూస్ శ్రీకాంత్, జనం న్యూస్ పసుపల దస్తగిరి ,శ్రీ సూర్య రాంబాబు యాగంటి పల్లె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author