వంద శాతం మాంసాహారులు ఉన్న రాష్ట్రం ఏదంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్త రాష్ట్రం తెలంగాణలో మాంసాహారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మరో నాలుగైదేళ్లు పోతే రాష్ట్రంలో శాకాహారి మాటే వినిపించనంతగా ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో శాకాహారుల శాతం 2.7 శాతమే. మిగిలిన 97.3 శాతం మంది తెలంగాణ ప్రజలు మాంసాహారులేనట. ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) నివేదిక తెలిపింది. 2019- 2021 మధ్య ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశంలో సగటు మాంసాహారుల శాతం 51 ఉండగా… అది తెలంగాణకు వచ్చేసరికి ఏకంగా 97.3 శాతానికి పెరగడం గమనార్హం.