హలో వద్దు.. వందేమాతరం ముద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫోన్ రింగయితే ‘హలో’ అని స్పందించడం ఇక గతకాల ముచ్చటే కాబోతోందా? హలోకు బదులుగా ”వందేమాతరం” అనడం తప్పనిసరి కానుందా? అవుననే చెబుతోంది ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం. అనడమే కాదు…గవర్న్‌మెంట్ రిజల్యూషన్ తో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి తమ సిబ్బంది ఫోన్ కాల్స్‌ను కానీ, ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు ”హలో”కు బదులు ”వందేమాతరం”అని అనాలి. ‘ఆజాదీ కి అమత్ మహోత్సవ్’ జరుపుకొంటున్న తరుణంలోనే మహాత్మాగాంధీ జయంతి కూడా ఆదివారంనాడు రావడంతో ఇందుకు సంబంధించిన ప్రచారానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది.