పేదల కడుపునింపేందుకే అన్న క్యాంటిన్లు.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: పేద ప్రజల కడుపునింపేందుకే అన్న క్యాంటిన్లను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిందని కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 14వ వార్డులో ఒక్క రోజు అన్న క్యాంటిన్ ఏర్పాటుచేసి పేద ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి పాల్గొన్న భరత్ అన్న క్యాంటిన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా భరత్ మాట్లాడుతూ అన్న క్యాంటిన్ ఏర్పాటుచేస్తుంటే పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మంచి పథకాలు కొనసాగించకపోవడం బాధాకరమన్నారు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆగిపోకూడదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మళ్లీ రాష్ట్రంలో అన్నక్యాంటిన్లు ప్రారంభించాలని భరత్ కోరారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని ఈ ప్రభుత్వం అన్న క్యాంటిన్లు తీసివేసిందన్నారు. ఇక కర్నూల్లో టిజి భరత్ 33 వార్డుల్లో అన్న క్యాంటిన్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వానికి వీటి ప్రాధాన్యత తెలియడం కోసం కృషి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ షేక్ జకియా అక్సారీ, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, కార్పోరేటర్ పరమేష్, రియాజ్, శ్యామ్, కరీముల్లా, ఖాసీం, రాజు, ఇర్ఫాన్, వార్డుల ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.