భారత్ లో ముస్లిం పీఎం కాగలరా ?
1 min readపల్లెవెలుగువెబ్ : బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. భారత సంతతి హిందువు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం భారత్ కు ఓ పాఠం వంటిదని అభిప్రాయపడ్డారు. భారత్ లో హిందువు, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులు కాకుండా, ఇతరులు ప్రధాని అవగలరా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రోద్బలిత రాజకీయాలు బాగా నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఇలాంటిది ఊహించగలమా? అని అన్నారు. “భారత ఉపఖండంలో జనించిన అన్ని మతాలను హిందుత్వ భావజాలం సమానంగానే చూస్తుంది. కానీ హిందుత్వవాదులే ఇతరులను సమానంగా చూడలేకపోతున్నారు” అని శశి థరూర్ విమర్శించారు.