ఏ.పి.ఎం.ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా యర్రా సాగర్
1 min readహర్షద్వనాలతో అభినందించిన పలువురు జర్నలిస్టులు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు లేడీస్ క్లబ్ ఆఫ్ ఏలూరు సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (APMF) ఏలూరు జిల్లా అధ్యక్షులు మత్తే బాబి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలన నుండి అనేక మంది వివిధ పత్రికల పాత్రికేయులు హాజరయ్యారు.ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి కొరకు పాత్రికేయులు సంక్షేమం కోసం పలు తీర్మానాలు చేశారు.ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి అధిక సంఖ్యలో నూతన సభ్యులను ఆహ్వానించాలని తీర్మానం చేసినారు.అర్హులైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే పాత్రికేయులకు అక్రిడేషన్లు మరియు ఇండ్ల స్థలాలు ఇప్పించుటకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ( ఏ.పి.ఎం.ఎఫ్ కార్యవర్గం స్వల్ప మార్పులు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అయినది. కార్తీకమాసం సందర్భంగా జిల్లా సంఘ సభ్యులు అంతా కలిసి కార్తీక వనసమారాధన త్వరలో ఏర్పాటు చేయడానికి తీర్మానం జరిగింది. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందుల రిత్యా జిల్లా అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి తీర్మానించడం జరిగింది. నూతనంగా కమిటీలోకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా యర్రా సాగర్ మరియు జిల్లా సహాయ కార్యదర్శిగా దాసరి అబ్బులను,ప్రచార కార్యదర్శిగా అచ్యుత్ సూర్య,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా శ్రవణం మణికంఠను,సలహాదారులుగ ఎన్.ఎస్.ఆర్ రాజు,ఏలూరు నియోజకవర్గ కార్యదర్శిగా కె మల్లికార్జునరావు, కోశాధికారిగా చంద్రయ్య,సహాయ కార్యదర్శిగా బలే సుబ్బారావు, ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షులుగా ఉప్పె చైతన్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడిదాసు ఉమామహేశ్వరరావు, కాపుదాసి రవికుమార్, బంటుమిల్లి నవీన్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు కడలి శ్యాం ప్రసాద్,ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు రాజేశ్వరరావు, జంగారెడ్డిగూడెం రెవిన్యూ డివిజన్ అధ్యక్షులు తానంకి అమల్ రాజ్,సహాయ కార్యదర్శి వేల్పుల సుందరం,రాంబాబు,మరియు ప్రత్యేక ఆహ్వానితులగా సీనియర్ జర్నలిస్ట్ బొల్లికొండ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.