మౌలిక వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు , వెబ్ కర్నూలు : చిన్న టేకూరులో డా. బి.ఆర్. అంబేడ్కర్ సెంటినరీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాటును శనివారం జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పరిశీలించారు.జూనియర్ కళాశాల లోని హాస్టల్ గదులు, వంట గది, డైనింగ్ హాల్ తో పాటు పక్కనే ఉన్న డా.బి. ఆర్.అంబేడ్కర్ ఐఐటి – మెడికల్ అకాడమీ తరగతి గదులను కూడా పరిశీలించారు.విద్యార్థులకు భోజన వసతులు, బోధనకు సంబంధించిన అంశాలను ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, ప్రిన్సిపల్ రామ సుబ్బా రెడ్డి లను అడిగి తెలుసుకున్నారు.. వంట గదిలో ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల భవనం పైన ఆధునిక పద్ధతిలో షెడ్స్ ఏర్పాటుకు అంచనాలను రూపొందించాల్సిందిగా APEWIDC అధికారులను ఆదేశించారు..అలాగే డ్రైనేజ్ కు సంబంధించి సీవేజ్ ట్యాంక్, ఐఐటి – మెడికల్ అకాడమీ భవనాలపై షెడ్స్ ఏర్పాటుకు కూడా అంచనాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు..తాగునీటి లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందని అధికారులు తెల్పగా భూగర్భ జల శాఖ అధికారులతో పరీక్ష చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద కాంపౌండ్ వాల్ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.