రెండవ కార్తీక సోమవారం.. పురవీధుల్లో భక్తుల తాకిడి
1 min readపల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: కాకర్తీక రెండోవ సోమవారం కావడంతో శ్రీగిరి భక్తులతో నిండిపోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మల్లన్న దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో శ్రీశైలం చేరుతున్నారు రెండవ కార్తీక సోమవారం మరియు పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల పురవీధులు భక్తులతో నిండిపోయింది స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు తెల్లవారుజామున పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మ తల్లికి వాయినాలు మొక్కులు సమర్పించి దీపారాధన చేసి భక్తులు మల్లన్న దర్శించుకుంటున్నారు మల్లన్న సర్వదర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుండటంతో కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు పాలు ఆలహారం బిస్కెట్లు ఆలయ అధికారులు అందజేస్తున్నారు స్వామి అమ్మవాలను సుమారు లక్ష మంది పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేకతలు విధులు నిర్వహిస్తున్నారు స్వామివారి అభిషేకం కర్తలకు అలంకార దర్శనం ఉంటుందని ఆలయ ఆలయ అధికారులు తెలియజేశారు భక్తులకు తగినన్ని ప్రసాదాలు అందుబాటులో ఉంచారు భక్తులు కార్తీకదీపం గంగాధర మండల మరియు శివాజీ గోపురం వద్దదీపారాధన ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈవో లవన్న నిరంతరం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నాడు.