విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: 55 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం గ్రంధాలయాధికారి వి. వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు మండల రిసోర్స్ భవనం వద్ద ఉన్న ఎలిమెంటరీ పాఠశాల నందు8తరగతి, 9వ తరగతి,10 తరగతి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు 1. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే లాభనష్టాలు? మీకు ఎదురైనా అనుభవాలు 2. గ్రంథాలయాలు-వాటి వలన కలిగే లాభాలు మరియు మోడల్ స్కూల్, కస్తూరిబా హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రామకృష్ణుడు హాజరయ్యారు ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో నెలకొన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఇలాంటి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హై స్కూల్ టీచర్ దస్తగిరమ్మ మాట్లాడుతూ గ్రంథాలయాలలో ఉన్న పుస్తకాల గురించి విద్యార్థులకు తెలియజేశారు గ్రంథాలయాధికారి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు 21వ తేదీన అనగా సోమవారం బహుమతులను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.