సంక్షేమం…అభివృద్ధి… ప్రభుత్వానికి రెండుకళ్లు..
1 min read– కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్:చెన్నూరు అభివృద్ధి- సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని, గడచిన మూడున్నర సంవత్సరములలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరవేయడం జరిగిందన్నారు, సోమవారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని ఆయన తెలిపారు, అంతేకాకుండా అభివృద్ధిలో రాష్ట్రం లోని ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి 2వేల జనాభా కలిగిన గ్రామాలన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు, ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన దాఖలాలు లేవని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెప్పినవి, చెప్పకూడనివి కూడా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించడం జరిగిందన్నారు, ఇదంతా కూడా మహిళలకు పెద్దపీట వేసి,వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుందని ఆయన అన్నారు, అంతేకాకుండా చెల్లూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు ఎందుకు సంబంధించి, ఎక్కడెక్కడ అయితే డ్రైనేజీ , సిసి రోడ్లు అవసరమా వాటన్నిటిని గుర్తించి ఎస్టిమేషన్ వేయాలని, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినోద్ కుమార్ రెడ్డి, పి ఆర్ ఏఈ మురళికి సూచించారు, అలాగే పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆయన వారిని ఆదేశించారు, అలాగే ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, ఎక్కడైన పైపులైన్ పనులు పెండింగ్లో ఉంటే వాటిని త్వరగ తిన పూర్తిచేయాలని అన్నారు, ఇప్పటికే మండలంలో సంక్షేమం- అభివృద్ధి పనుల కింద 113 కోట్ల 6 లక్షల 52 వేల 7, వందల 50 రూపాయ లు ఖర్చు చేయడం జరిగిందన్నారు, అలాగే అభివృద్ధిలో భాగంగా ఇంకా మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజల మౌలిక వసతులను తీర్చడమే కాకుండా ఎక్కడ ఏ సమస్య లేకుండా మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు, అధికారులు ,ప్రజాప్రతినిధులు, సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధిలో భాగం కావాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చింత కొమ్మ దిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయుల రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్ ,ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న) , డీసీఎం డిసిఎంఎస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, రఘురామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్, ఎంపీటీసీలు దుంప నాగిరెడ్డి, సాధిక్ అలీ, పి, చంద్రశేఖర్, సర్పంచ్ లు సిద్ది గారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణరెడ్డి, తుంగ చంద్ర శేఖర్ యాదవ్, పెడబల్లె ప్రదీప్ రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి మండల ఎస్ టి సెల్ కన్వీనర్ శ్రీనివాసులు వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.