వర్గీకరణ కోసం.. కేంద్రంతో తేల్చుకుంటాం..:ఎంఎస్పీ
1 min readపల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పోరాట కార్యక్రమాలలో భాగంగా ఈదినం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం జరిగినది మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెస్పి నాయకుడు రామాంజనేయులు, యంఆర్పియస్ జిల్లా కన్వీనర్ బి.మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో MSP రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వం మాదిగలిగిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ తో పాటు రామచంద్రారాజు కమిషన్ నివేదికలను పార్లమెంట్లో పెట్టి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఎస్సీలలోని 59 ఉప కులాలకు జనాభా దామాషాన రిజర్వేషన్ ఫలాలు అందేలాగున సమన్యాయం చేయాలని, లేని పరిస్థితుల్లో జరగబోవు ఎన్నికలలో మాదిగల సత్తా ఏంటో చూపించి బిజెపి పార్టీని భూస్థాపితం చేసే వరకు ఉద్యమాలు ఆపమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MSP తంబళ్లపల్లి నియోజకవర్గ ఇంచార్జి దుమ్ము చిన్న, కో కన్వీనర్ తిరుపాల్, MRPS తంబళ్లపల్లి నియోజకవర్గ ఇంచార్జి వెంకటేష్, రాయచోటి MRPS మండల కన్వీనర్ ఆనంద్, చిన్నమండెం MRPS కన్వీనర్ ఆంజనేయులు, సంబేపల్లి MRPS మండల కన్వీనర్ సి.వి.రమణ, మదనపల్లి MRPS నియోజకవర్గ ఇంచార్జ్ సొట్ట రెడ్డి శేఖర్, టౌన్ అధ్యక్షులు రవీంద్ర, అన్నమయ్య జిల్లా కో కన్వీనర్ ప్రేమ్ కుమార్, పీలేరు MRPS నియోజకవర్గ ఇంచార్జ్ యర్రయ్య, మదనపల్లి నియోజకవర్గం సొట్ట రెడ్డి శేఖర్ వై.రవీంద్ర తంబళ్లపల్లి నియోజకవర్గం దుమ్ము చిన్న వెంకటేష్ పీలేరు నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం రాజా, వెంకటరమణ, వెంకటాద్రి, యంఆర్ పియస్ బాలాజీ, సురేష్, అన్నమయ్య, దొరబాబు, సుబ్బయ్య, నారాయణ, వెంకటరమణ లతోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.