ఏసు పుట్టుక..మనకు గొప్ప వరం
1 min read– అంగరంగ వైభవంగా క్రిస్మస్ పండుగ
పల్లెవెలుగువెబ్, మిడుతూరు: మండలంలోని వివిధ గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను కనీ వినీ ఎరు గని రీతిలో ఘనంగా జరుపుకున్నారు.మండలంలోని మిడుతూరు,వీపనగండ్ల,జలకనూరు,తలముడిపి, చింతలపల్లి,అలగనూరు,సుంకేసుల,చెరుకుచెర్ల గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో పిల్లలు పెద్దలతో పాటుగా అందరూ క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు.పశువుల పాకలో ఏసు పుట్టుక మనకు ఒక వరమని ఉప్పలదడియ ఆర్సీఎం విచారణ గురువులు పి.శ్యామ్ కుమార్ మరియు సహాయ గురువులు అన్నారు.ఈయన ఆధ్వర్యంలో విచారణలో ఉన్న ఉప్పలదడియ,49 బన్నూరు, చౌటుకూరు,దేవనూరు,కడుమూరు,పైపాలెం,దిగువ పాడు గ్రామాలలో శనివారం రాత్రి నుండి రాత్రంతా కూడా నిద్రపోకుండా పిల్లలు పెద్దలు మహిళలు యువకులు ఆలయ మందిరాల్లో ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు.ఈగ్రామాలలో విచారణ గురువులు పి. శ్యామ్ కుమార్ అన్ని గ్రామాలలో దివ్య బలిపూజను సమర్పించి యేసు క్రీస్తు పుట్టుక గురించి ఆయన సందేశం ఇచ్చారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో ఉంటూ మనుషుల్లో ఎలాంటి కలతలు లేకుండా దేవుని అడుగుజాడలలో నడిచే విధంగా మీరు ఉండాలన్నారు.ఏసుక్రీస్తు గొప్ప శక్తివంతుడని ఆయన మనందరి కోసం పశువులపాకలో జన్మించాడని అన్నారు.తదనంతరం అన్ని గ్రామాల పురవీధులలో బాల ఏసును భారీ ఊరేగింపుతో మేళ తాళాల నడుమ తపాకాయలు కలుస్తూ ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా అన్ని గ్రామాలలో ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు.