రైతులకు.. టీడీపీ అండగా ఉంటుంది
1 min read- వీరబల్లిలో ప్రాజెక్టు కు అవసరమైన నీరెక్కడవుంది
–త్రాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది
–సోలార్, గాలి మర్రలు తో విద్యుత్ ఏర్పాటు చేయవచ్చు కధా?
- టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు
పల్లెవెలుగు.అన్నమయ్య జిల్లా.రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం వంగిమళ్ళ దిగువ రాచపల్లెలోని ఆర్యమాంబ ఆలయం వద్ద బుధవారం ఆ గ్రామ రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి రైతుల ఆహ్వానం మేరకు టిడిపి రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సంధర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుతో జనాలకు, రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండే అవకాశం లేదన్నారు. రైతుల భూములకు నష్ట పరిహారం చెల్లించకుండా దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే న్యాయ పరంగా ఎదుర్కొని రైతుల పక్షాన నిలబడతామన్నారు. రైతులకు అన్యాయం చేస్తే రైతుల పక్షాన ఉండి ఉద్యమిస్తామన్నారు. వీరబల్లిలో ప్రాజెక్టు కు అవసరమైన నీరెక్కడవుందన్నారు. ఈ ప్రాజెక్టు తో త్రాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోలార్, గాలి మర్రలు తో విద్యుత్ ఏర్పాటు చేయవచ్చు కధా? అని ప్రశ్నించారు. తమ భూములు ప్రాజెక్టు కు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. తరతరాలుగా ఆ భూములను నమ్ముకొని మామిడి, నిమ్మ, ఇతర ప్రత్యామ్నాయ పంటలను పెట్టుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. అలాంటి భూములను ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. దౌర్జన్యంగా తమ భూములను లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, సీనియర్ నాయకులు యర్రపురెడ్డి రెడ్డెప్ప రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, ప్రసాద్ రాజు, నాగభూషణం, మండల ప్రధాన కార్యదర్శి తోళ్ళ సురేంద్ర, నందకూమార్ నాయుడు, మహిళా అధ్యక్షురాలు చెంగా నాగసుబ్బమ్మ, మైనారిటీ నాయకులు సలీం, బాషు, ప్రభాకర్ నాయుడు, మాజీ సర్పంచ్ వెంకటరమణ రాజు, రామచంద్ర, దుర్గం ఆంజనేయులు, సీతారామురాజు, వండాడి సుబ్బరాయుడు, వర్ల ఆంజనేయులు, నాగప్ప నాయుడు, వీరామృత్ నాయుడు, యలంపల్లి రమణయ్య, రామక్రిష్ణమ రాజు, సిధ్ధిరాజు, డ్రైవర్ శివ, ఐటిడిపి పవన్, సుధాకర్ రాజు, గ్రామ రైతులు కొత్త గంగిరెడ్డి, వెంకటసుబ్బా రెడ్డి, హిబ్రహీమ్, మద్దెల వెంకటేశ్, చెన్న క్రిష్ణా రెడ్డి, శ్రీరాములు, రమేష్, చిన్నప్ప, గంగయ్య, వెంకట సుబ్బయ్య, నాగార్జున నాయుడు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.