వృద్ధాప్యం శాపం కాదు.. అనుభవాల ఆస్తి
1 min read– నజీర్ అహ్మద్( మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వైస్ ప్రెసిడెంట్)
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో సంపదపై ఉన్న ఆశలు, ఆ స్థాయికి తీసుకు వచ్చిన వృద్ధులపైన ప్రేమానురాగాలతో చూడాల్సిన వారి సంతానం, చీత్కారాలతో, హేళనతో వృద్ధులు లోనవ్ఞ తున్న దయనీయస్థితి కొనసాగుతుందని నజీర్ అహ్మద్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్సార్ బీసీ కాలనీలోని వృద్ధాశ్రమంలో స్టేట్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వైస్ ప్రెసిడెంట్ బి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా అనాధ వృద్ధులకు ఆత్మకూరు మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అనాధ వృద్ధులకు పండ్లు, ఫలాలు మరియు బెడ్ షీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు కమిటీ ప్రెసిడెంట్ ఎస్.కె కలీముల్లా వైస్ ప్రెసిడెంట్ మున్నా మరియు ఖాదర్ భాషా , సెక్రెటరీ రఫిక్ , జైన్ సెక్రటరీ చేపల రఫిక్ మరియు ట్రెజరర్ ఖదీర్ అహ్మద్ పాల్గొనడం జరిగినది.