కారణజన్మునికి ఘన నివాళులు – టిడిపి నేతలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంవద్ద స్వర్గీయ ఎన్ టి రామారావు చిత్రపటానికి పూలమాలవేసి, హాస్పిటల్ నందు పేషెంట్లకు ఆయన 27వ వర్ధంతిని పురస్కరించుకొని పండ్లను, బ్రెడ్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, ఇంద్ర రెడ్డి శివారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు కారణజన్ముడు, యుగపురుషుడని కొనియాడారు. తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో, రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు ఒక ధ్రువతార అన్నారు, బడుగు బలహీన వర్గాల వారికి కూడు, గూడు, గుడ్డ అందించడమే నిజమైన ప్రజాస్వామ్యం అని ప్రవచించిన ప్రవక్త అన్నారు. సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే దేవుడు, ఆ దేవునికి నైవేద్యం సమర్పించడమే నా సిద్ధాంతమని చెప్పిన నూతన సిద్ధాంతకర్త ఎన్టీ రామారావు అన్నారు. జిల్లా పార్లమెంటరీ కార్యవర్గ కార్యదర్శి ఆవుల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతుల పునరుద్యోగరానికి కృషిచేసిన అసలైన తెలుగు బిడ్డ అన్నారు, కానీ దురదృష్టవశాత్తు జగన్ పాలనలో తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అన్న విధంగా పాలన సాగుతుందన్నారు, తెలుగు గంగా_ గాలేరు _నగిరి అంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టులు ఎన్టీ రామారావు మానస పుత్రికలు. ఈ ప్రాజెక్టులలో సింహభాగం పనులు అప్పటి ప్రభుత్వాలు పూర్తి చేయగా జగన్ పాలనలో నిధులు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. ఎన్టీ రామారావు జీవిత చరిత్ర సమాజానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం, అనుసరణీయమని ఆవుల పవన్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి వ్యవసాయ కార్యదర్శి మల్లికార్జున్రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ నాయకులు షబ్బీర్, ఖాజా హుస్సేన్( రామారావు), మండల వ్యవసాయ రైతు అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి, చెన్నూరు టిడిపి అధ్యక్షులు ఆకులచలపతి మండల బీసీ ఉపాధ్యక్షులు కొండేటి కృష్ణయ్య, నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు చెన్నయ్య, రాంప్రసాద్, మండల టిడిపి నాయకులు కల్లూరు ఓబుల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం మండల టిడిపి ఛాంపియన్ మణికంఠ పాల్గొన్నారు.