PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువత చేతిలోనే భారతదేశ భవిష్యత్తు..

1 min read

– యువ ఓటర్లకు అవగాహన..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: యువత చేతిలోనే భారతదేశ భవిష్యత్తు ముడిపడి ఉందని 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని బుధవారం నాడు 13 వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు తాసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో తాసిల్దార్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం యువతకే ఉందన్నారు. అందరూ ఓటు హక్కును గుర్తు ఎరిగి మసులుకోవాలన్నారు. మన భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకులను మనం ఎన్నుకోవాలన్నారు. అదే విధంగా ఓటు హక్కును బాధ్యతయుతంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతీ యువత పాల్గొన్నారు.

About Author