PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో రెండు కోట్ల రూపాయలతో స్టేట్ బ్యాంక్ రోడ్డు సిసి రోడ్డు, రెండవ గ్రామ సచివాలయం, మండల పరిషత్ కార్యాలయం భవనాలను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ యువ యకులు కాటసాని ఓబుల్ రెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తీరు పాలు రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు మానసవీణ, వైయస్సార్ పార్టీ నాయకులు గుండం షేషి రెడ్డి, అబ్దుల్ ఖైర్, బనగానపల్లె మండల వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, అబ్దుల్ ఫైజ్, మండల ఉపాధ్యక్షురాలు మంగవరపు లక్ష్మీదేవి, కురిని సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ మెడికల్ శ్యామలాదేవి, జడ్పిటిసి సుబ్బ లక్ష్మమ్మ, బనగానపల్లె పట్టణ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ దీవెనమ్మ,మండల ఎంపీటీసీలు, మండల సర్పంచులు ప్రజా ప్రతినిధులు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మండల తాసిల్దార్ రామకృష్ణ, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ శివరామయ్య, పంచాయతీ రాజ్ డివిజనల్ ఇంజనీర్ నాగ శ్రీనివాసులు, రూరల్ వాటర్ స్కీం డివిజనల్ ఇంజనీర్ ఉమాకాంత్ రెడ్డి, కాంట్రాక్టర్లు మద్దయ్య, కంబగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని కేవలం నాలుగు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడి శాసనసభ్యుడు మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న కూడా నిర్మించలేకపోయిన ఘనత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పారు. బనగానపల్లె పట్టణంలో పేదలకు 36 ఇంటి స్థలాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం సిద్ధంగా వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందని న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుపడ్డది బీసీ జనార్దన్ రెడ్డి కాదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె పట్టణంలో 22 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని అలాగే అబుకు కోవెలకుంట్ల పట్టణాల్లో కూడా ప్రభుత్వ వైద్యశాలల ఆధునీకరణ నిర్మాణం జరుగుతుందని అలాగే బనగానపల్లె నియోజకవర్గం లోని పీహెచ్సీ సెంటర్లో అన్నిటికీ కూడా 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడమే కాకుండా అన్ని అన్ని పీహెచ్ఈసి సెంటర్లలో కూడా మౌలిక వసతులు కల్పించడానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. అలాగే బనగానపల్లె పట్టణ ప్రజల సౌకర్యార్థం ఒక కోటి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని త్వరలోనే షాదీ ఖానా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అలాగే మైనార్టీ సోదరుల స్మశాన ప్రహరీ గోడల కొరకు 69 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పండగ సమయాల్లో ప్రార్థనలు చేసుకునే ఈద్గాకు ప్రహరీ కూడా తన సొంత నిధులతో నిర్మించడం జరిగిందని చెప్పారు. బీసీ జనార్దన్ రెడ్డి గ్రామాల్లో వెళ్ళినప్పుడు దమ్ము ధైర్యం ఉందా అభివృద్ధి చేశావా అభివృద్ధికి సవాల అని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండడంతో తాను కూడా బీసీ జనార్దన్ రెడ్డికి తాను కూడా ఒక సవాల్ విసురుతున్నానని అభివృద్ధి విషయంలో ఎక్కడికి, ఏ సెంటర్లో అయినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో నీరు చెట్టు పథకం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడా చేయలేదని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మళ్లీ సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతాయని చెప్పారు.

About Author