స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలు
1 min read– జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాల కు సంబంధించిన వాల్ పోస్టర్లను, కరపత్రాలను, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, డిఆర్ఓ నాగేశ్వరరావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి రామగిడ్డయ్య, లతో కలిసి ఆవిష్కరించారు, అనంతరం హాజరైన అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి,స్పర్శ కుష్ఠు వ్యాధి కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, మాట్లాడుతూ మన జిల్లాలో స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం పక్షోత్సవాలు జనవవరి 30నుండి ఫిబ్రవరి 13, 2023 వరకు జరుగుతాయని,జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా అన్ని గ్రామ పంచాతీ లలో,గ్రామ వార్డ్ సచివాలయం లలో కుష్ఠువ్యాధి పై గ్రామ సభలు నిర్వచ్చించాలని.గ్రామ సభలు నిర్వహించే వారు MLHP/ANM, Asha, AWW, మరియు టీచర్లు. పాల్గొనేలా చూడాలనిగ్రామ సభలకు ఎక్కువ మంది ప్రజల పాల్గొనేటట్లు చూడాలని,గ్రామ సభలలో ప్రజలకు కలెక్టర్ గారి సందేశం చదివి వినపించాలని, కుష్ఠు వ్యాధి పై అవగాహన కల్పించి, MDT ఉచిత చికిత్స గురించి తెలియజేయాలన్నారు.జిల్లా లెప్రసి ఎయిడ్స్ మరియు టిబి అధికారి భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం కుష్టు వ్యాధిపై గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలో ప్రజలకు కరపత్రాలు, సమావేశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు అక్టోబర్ 2వ తారీఖు నుండి 14 రోజులపాటు నిర్వహిస్తుంటామని, జిల్లాలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 30వ తారీఖు నుండి ఫిబ్రవరి 13వ తారీకు వరకు కుష్టు వ్యతిరేక దినోత్సవాల్లో కుష్టు వ్యాధిపై ప్రజలకు కరపత్రాలు సమావేశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు మనము స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాల కు సంబంధించిన వాల్ పోస్టర్లు మరియు కరపత్రాలను, ఆవిష్కరించుకున్నామన్నారు. జిల్లాలో 13 మందికి శస్త్ర చికిత్స చేయించుకున్నారన్నారు. చర్మం పైన స్పర్శ లేని మచ్చలు ఉన్న, చెవుల మీద, ముఖం మీద కనితలు ఉన్న, కాళ్లు చేతులపై స్పర్శ తగ్గిన, కనురెప్పలు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిన కుష్టు వ్యాధి లక్షణాలని తెలుసుకొని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యందు పరీక్షలు చేయించుకుని ఉచితంగా ఇచ్చే ముందులను వాడి కుష్టు వ్యాధి నుండి బయటపడవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున, రమ,అనూరాధ,సిపిఓ అప్పలకొండ, HEO శివశంకర్ , డిప్యూటీ HEO దేవ ప్రసాద్ ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.