PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివదీక్షా భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శివ దీక్ష భక్తులు రద్దీ అధికంగా ఉంటున్న కారణంగా నిర్ధారిత రోజులలో మాత్రమే శివదీక్షా భక్తులకుస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం కల్పించబడుతోంది. జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు మాత్రమే స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించడం జరుగుతుంది ఇతరులు సాధారణ భక్తులతో కలిసి స్వామిఅమ్మవార్లను దర్శించుకోవలసివుంటుంది. గతంలో వలనే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల ప్రారంభములో 5 రోజులపాటు అనగా11.02.2023 నుండి 15.02.2023 వరకు జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు నిర్దిష్టవేళలో మాత్రమేస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పించబడుతుంది.15వ తేదీ సాయంత్రం శివదీక్షా భక్తులందరికీ కూడా సాధారణ భక్తుల వలనే స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. శివదీక్షా భక్తుల ప్రత్యేక దర్శన క్యూలైన్ చంద్రవతి కల్యాణమండపం నుండి ప్రారంభమవుతుంది.మంగళవారం నుంచి శుక్రవవారం వరకుమధ్యాహ్నవేళలో ఉచిత స్పర్శదర్శనం.భక్తుల సౌకర్యార్థమై వారంలో నాలుగురోజులపాటు అనగా మంగళవారం నుంచి శుక్రవారం వరకుమధ్యాహ్నవేళలో ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించబడుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముందురోజు వరకు అనగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు మంగళ, బుధ,గురు, శుక్రవారాలలో మధ్యాహ్నవేళలో ఇతర భక్తులతో పాటు శివదీక్షా భక్తులకు కూడా స్వామివార్ల ఉచితస్పర్శదర్శనానికి దేవస్థానం భక్తులకు ఏర్పాటు చేశారు మధ్యాహ్నవేళలో సుమారు 1500 నుంచి 1800 మందికి మాత్రమే స్పర్శదర్శనానికి వీలు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయములో స్పర్శదర్శనానికి వెళ్ళే భక్తులు మధ్యాహ్నం గం.1.30 నిమిషాలు క్యూకాంప్లెక్స్ కంపార్ట్మెంట్ లోకి. . వెళ్లవలసి ఉంటుంది.
శివదీక్షా భక్తుల సౌకర్యార్థం. ప్రత్యేక ఏర్పాట్ల
బ్రహ్మోత్సవాలలో శివదీక్షా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడుతున్నాయి.ఉత్సవాల సమయములో శివదీక్షా భక్తులకు చంద్రవతి కళ్యాణమండపం నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించబడుతుంది. శివదీక్షా భక్తులు దర్శనానికి వేచివుండేందుకు వీలుగా చంద్రవతి కల్యాణమండపంలో తగు ఏర్పాట్లుచేయబడుతున్నాయి.చంద్రవతి కళ్యాణమండపంలో దర్శనానికి వేచివున్న సమయములో మంచినీరు. అల్పాహారం, బిస్కెట్లు మొదలైనవి నిరంతరం అందజేయబడుతుంటాయి.ఉత్సవ సమయాలలో అన్నప్రసాదవితరణ భవనము నందు దీక్షా భక్తులకు ప్రత్యేకంగా రెండు హాళ్ళనందు రాత్రివేళలో అల్పాహారం ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారుశివదీక్షా శిబిరాలలో 15 రోజులపాటు దీక్షా భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించవచ్చు.కావున శివ దీక్ష స్వాములు సంయమనం పాటిస్తూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వుండేందుకు దేవస్థానానికి సహకరించవలసినదిగా ఆలయ ఈవో ల ఉన్న ప్రకటన తెలియజేశారు.

About Author