PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుబజార్ ఏర్పాటుతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట

1 min read

– రాయచోటిలోని రైతు బజార్ పునః ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రైతులు,కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉండేలా వైఎస్ఆర్ రైతు బజార్ ను అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు .శుక్రవారం రాయచోటి పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ సమీపంలో రూ 1 కోటి నిధులుతో నిర్మించిన వైఎస్ఆర్ రైతు బజార్ పునః ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల అంగళ్లును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు,వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థ అడ్డుకట్ట వేసి రూపుమాపడానికి ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు బజార్ లను ఏర్పాటు చేసిందన్నారు.ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం రాయచోటిలో వైఎస్ఆర్ రైతు బజార్ ను ప్రారంభించడం జరిగిందని, రైతుల అవగాహనతో నేడు పూర్తిస్తాయిలోకి రావడం హర్షదాయకమన్నారు. నియోజక వర్గ పరిధిలోని అర్హత కలిగి కూరగాయలు,పంటలు పండించుకుని కమీషన్లు లేకుండా , విక్రయించుకునే రైతులకు రైతు బజార్ మంచి వ్యాపార కేంద్రంగా మారనుందని, కొనుగోలు దారులకు కూడా రైతులు పండించి విక్రయించే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు.మొదటి రోజు పెద్దఎత్తున కొనుగోలుదారులు వచ్చేలా మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు,మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, మదనపల్లె నియోజక వర్గ పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, వైస్ చైర్మన్ తబ్రేజ్, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి,జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు దిన్నెపాడు రవిరాజు, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష, రామాపురం జెడ్ పి టి సి మాసన వెంకట రమణ, వైస్ ఎంపిపి రవిశంకర్ రెడ్డి,జాకీర్,జిన్నా షరీఫ్, సుగవాసి శ్యామ్,ఫయాజ్ అహమ్మద్, పల్లా రమేష్,జయన్న నాయక్,రియాజ్, భాస్కర్,ఆర్ట్స్ శంకర్, యర్రపురెడ్డి బ్రహ్మానంద రెడ్డి, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, మాజీ కౌన్సిలర్ ఆనందరెడ్డి, కో ఆప్షన్ అయ్యవారు రెడ్డి, షిరిడీసాయి కళాశాల డైరెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు,కొనుగోలుదారులుతో కిక్కిరిసిన రైతు బజార్
వైఎస్ఆర్ రైతు బజార్ లో అతితక్కువకే కూరగాయలు దొరుకుచుండడంతో పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు దారులు పెద్దఎత్తున తరలివచ్చి తాజా కూరగాయలను కొనుగోలుచేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు కూరగాయలను తక్కువ ధరలకు అందేలా చొరవ చూపారు.రైతు బజార్ ఏర్పాటులో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయంరాయచోటి ప్రాంత రైతులకు వ్యాపారంలో అండగాను, కూరగాయల కొనుగోలుదారులకు అనువైన ధరలతో లభించేలా రాయచోటి పట్టణ నడిబొడ్డున అన్ని హంగులుతో వైఎస్ఆర్ రైతుబజార్ ఏర్పాటులో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమంటూ నియోజక వర్గ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు పండించిన కూరగాయలు, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సదుద్దేశ్యంతో రైతు బజార్ మంజూరుకు సీఎం జగన్ దృష్టికి శ్రీకాంత్ రెడ్డి తీసుకెళ్లి రూ 1 కోటి నిధులు మంజూరు చేయించడం, పట్టణ నడిబొడ్డున ,పల్లె ప్రాంత వాసులకు ,పట్టణ ప్రజలకు అనువుగా ఉన్న కోట్లు విలువచేసే ఎకరం స్థలాన్ని రైతు బజార్ కు ఇప్పించడం, త్వరిత గతిన రైతు బజార్ నిర్మాణ పనులును పూర్తి చేయించి వినియోగంలోకి తేవడం లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేసిన కృషి,చొరవ అభినందనీయం, ప్రశంసనీయమంటూ ప్రజలు పేర్కొంటున్నారు.

About Author