పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: నియోజకవర్గం లో కోవెలకుంట్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు స్వచ్ఛభారత్ కార్మికుల సంఘం ,సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ సంఘీభావం ప్రకటించి స్వచ్ఛభారత్ కార్మికులకు 12 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అలాగే పిఎఫ్ , ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని , అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 10000 వేతనం పెంచుతూ వచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని, కార్మికులకు పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలని , కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కార్మికుల సంఘం మండల కార్యదర్శి త్యాగరాజు, అచ్చమ్మ, మద్దమ్మ ,గుర్రప్ప ,భాస్కర్ ,సంటెన్న, బాలమునమ్మ ,రంగమ్మ కార్మికులు పాల్గొన్నారు.