ఫ్యాక్టరీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి
1 min read– ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నసిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం
– ఏఐటీయూసీ హెచ్చరిక
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో కార్యాలయంలో ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివ బాలకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుతబనగానపల్లె మండలం ,ఎనకండ్ల గ్రామంలో ఉండే జయ జ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ కి స్థానిక రైల్వే స్టేషన్ నుంచి బొగ్గు రవాణా జరుగుతున్నది .ఈ రవాణాలో రోడ్డు వెంట బొగ్గు పడడం వల్ల ఈ బొగ్గు మీద బైకులు నడిపి స్కిడ్ అయికిందపడి దెబ్బలు తగులుతున్నవి , అది కనపడే దృశ్యం కానీ కనపడకుండా ఈ బొగ్గు వాహనాలు తిరగడం వల్ల మెత్తగా తయారై గాలిలో కలిసిపోయి గాలిని కలుషితం చేసిప్రజలకుశ్వాసకోశ వ్యాధులు , గుండె జబ్బులు అధిక మయ్యెలా చేస్తాయి,అంతేకాకుండాఇవి దుమ్ముతో కలిసికళ్ళలో పడడంవల్ల కంటి రెటీనా దెబ్బతింటున్నది. కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం దీనికి బాధ్యత వహిస్తూ వారి ట్రాన్స్పోర్ట్ లోడు తగ్గించి సరియైన పట్టలు బిగించుకొని ఇలా రోడ్డు వెంట పడకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇది చూస్తూ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు ఇకనైనా అధికారులు దీనిపై స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యం పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఒకవేళ ఇది ఇలానే రిపీట్ అయితే ఏఐటియుసి ఆధ్వర్యంలోధర్నా చేసి అవసరమైతే ప్రజల ప్రాణాలకు దెబ్బతీస్తుంది కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీని బందు చేయించేంతవరకు కూడా లెక్కచేయకుండా పోరాడుతామని చెప్పేసి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని హెచ్చరించారు .