సమయాన్ని సద్వినియోగం చేసుకొండి
1 min read– జిల్లా విద్యా శాఖ అధికారి V. రంగా రెడ్డి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వి. రంగారెడ్డి సూచించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ హుస్సేనమ్మ అధ్యక్షతన 10 వ తరగతి విద్యార్థులకు “పరీక్ష పర్వ్ 4.0″కార్యక్రమంలో భాగంగా “సెలబ్రేషన్ ఆఫ్ ఎగ్జా”పైన ఒరియాంటేషన్ కమ్ సెన్సిటి జెషన్ ప్రోగ్రాం ఫర్ స్కూల్ చిల్డ్రన్ సమావేశం నిర్వహించారు. ఈ మోటివేషన్ సమావేశంలో కర్నూల్ జిల్లా విద్యా శాఖ అధికారి వి. రంగారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు సులభ శైలిలో ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకునే విధానాన్ని,పరీక్ష రాసే విధానాన్ని వివరించారు.అన్ని సబ్జెక్టులలో సులభమైన ప్రశ్నలను మొదట నేర్చుకోవాలని,విద్యలోన వెనుకబడ్డ విద్యార్థుల కోసం ఉపాద్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అని సూచించారు. డైట్ లెక్షరర్ సంసుద్దిన్ మాట్లాడుతూ చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.ఇంకా పరీక్షలు రాసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మండల విద్యాధికారి మస్తాన్ వలీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అరుణాచలం రెడ్డి,ఉమామహేశ్వర రెడ్డి ఉపాధ్యాయిని ఉపాద్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.ఇదే కార్యక్రమాన్ని పత్తికొండ లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మస్తాన్ వలీ అధ్యక్షతన,బాలుర గురుకుల పాఠశాలలో ఇంచార్జి ప్రిన్సిపల్ సువర్ణ లత అధ్యక్షతన జరిగాయి.