PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించడంలో జగన్​ విఫలం

1 min read

ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరఆంజనేయులు మరియు ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య(చంటి)

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించడంలో విఫలమయ్యారని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరఆంజనేయులు మరియు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి బడేటి చంటి ఆరోపించారు. స్థానిక పవర్ పేట లోని పార్టీ కార్యాలయంలో గన్ని, బడేటి మీడియా తో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు డా సునీతారెడ్డి తన తండ్రి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు అధికారులు ఛేదిస్తారనే నమ్మకం తమకు లేదని అందుకే తన తండ్రి హత్య కేసును పక్కరాష్ట్రానికి బదిలీ చేయాలనీ కోరి, సుప్రీం కోర్టు ద్వారా కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేసుకున్నారని ఇద్దరు గుర్తు చేశారు. దీన్ని బట్టి చుస్తే జగన్ ప్రభుత్వం పై ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న నమ్మకం ఏమిటో అర్థం అవుతుందన్నారు.గుండెకు స్టెంట్ వేయించుకొని చికిత్స పొందుతున్న 70 ఏళ్ళు దాటిన వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్య చేశారని, ఆయన ఇంట్లోకి ప్రవేశించిన నరహంతకులు ఆయన ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు ఛాతి మీద 7 సార్లు కొట్టారని ఆ తరువాత గొడ్డలి వేటు వేశారని, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వివేకాతో బలవంతంగా తన డ్రైవర్ ప్రసాద్ చంపబోయాడు, అతన్ని వదిలిపెట్ట వద్దు అంటూ ఉత్తరం రాయించి సంతకం పెట్టించారని సాక్షులు చెబుతున్నారని అన్నారు. అనంతరం బెడ్ రూమ్ నుండి బాత్ రూమ్ వరకు వివేకానంద రెడ్డిని లాక్కెళ్లి కిరాతకంగా హతమార్చారని చెబుతున్నా దోషులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అని ఆయన ప్రశ్నించారు.కోడికత్తి దాడి లాగే ఎన్నికల్లో గెలవడానికి తన మామ హత్యకు జగన్ పథక రచన చేసి ఉంటారని, వివేకా హత్యలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని మొదట్లో తాము అనుమానించలేదని, అప్పట్లో సందేహించి ఉంటె 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్ రెడ్డి ఓడిపోయే వారని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తన తండ్రిని హత్య చేసిన హంతకులెవరో తేల్చాలని తన అన్న జగన్మోహన్ రెడ్డిని కోరానని, అనుమానితుల పేర్లు కూడా చెప్పానని వివేకా కూతురు డా సునీతా రెడ్డి చెబుతుంటే , వాళ్ళను ఎందుకు అనుమానిస్తున్నావు, నీ భర్తే హత్య చేయించి ఉంటాడేమో అని అన్యాయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని, ఆ మాటలు తనను బాధించినట్లు పోలీసుల వాంగ్మూలంలో సునీతా రెడ్డి తెలిపినట్లు బడేటి చంటి పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ టిక్కెట్ అని సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే వివేకానందరెడ్డి హత్యను టిడిపి ప్రభుత్వంపై నెపం చూపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, తాడేపల్లి ప్యాలెస్ అండ లేకుండా ఇన్ని నేరాలు ఘోరాలు చేయడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పడు అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి సరికొత్త డ్రామాలకు తెర లేపుతున్నారని ఆయన విమర్శించారు. జగనాసుర రక్త చరిత్రకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని గన్ని ఆంజనేయులు, బడేటి చంటి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు,చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు,కొల్లేపల్లి రాజు గంగరాజు,శివ ప్రసాద్,బేజ్జం అచ్చయమ్మ,తవ్వ అరుణ తదితరులుపాల్గొన్నారు.

About Author