నగల దొంగతనం ముద్దాయిని అరెస్ట్
1 min read– సీఐ సుబ్బరాయుడు ఎస్ఐ రామిరెడ్డి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన డోన్ డిఎస్పి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: మండలం లో 12 వ తారీఖునకోయిలకుంట్లకుచెందినశివరామకృష్ణయ్య తన భార్యతో కలిసి కోవెలకుంట్ల నుండి డ్రైవర్ సహాయంతో కారులో బయలుదేరి బనగానపల్లెకు వచ్చి పెళ్లి చూసుకొని పెళ్లి అనంతరం సుమారు 5 తులాల నెక్లెస్ ను కార్ డాష్ బోర్డులో పెట్టి బనగానపల్లె లోని మార్కెట్ యార్డు వద్దకు వెళ్లి తిరిగి వచ్చి చూడగా డాష్ బోర్డులో నెక్లెస్ కనిపించలేదని ఫిర్యాదు ఇవ్వగా బనగానపల్లె ఎస్సై రామిరెడ్డి కేసు నమోదు చేశారు.నంద్యాల జిల్లా ఎస్పీ రఘు వీర్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాబడిన సమాచారం మేరకు బుధవారం బనగానపల్లె పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కోయలకుంట్ల కు చెందిన అత్తార్ ఉమర్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద దొంగతనం కేసులోని ఐదు తులాల నెక్లెస్ దొరికినది.ముద్దాయిని అరెస్టు చేసి రిమాండుకు పంపడం జరిగినది.కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించినందుకు డోన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి బనగానపల్లె సిఐ బి సుబ్బారాయుడు ని, ఎస్సై పి రామిరెడ్డి ని మరియు సిబ్బంది సుబ్బరామకృష్ణ, ప్రదీప్ లను ప్రత్యేకంగా అభినందించారు. కొసమెరుపు:-కారు డ్రైవరే గోల్డ్ దొంగతనం చేసి ఏమీ తెలియనట్లుగా నటించి చివరకు కటకటాల పాలయ్యాడని బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బరాయుడు చెప్పారు.