భలే రామస్వామి కళ్యాణ మహోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు: ముసునూరు మండలం ఏలూరు జిల్లా మహాశివరాత్రి స్థిర వారం శని త్రయోదశి పురస్కరించుకొని శ్రీ భలే రామలింగేశ్వర స్వామి దేవస్థానము (భలే రామస్వామి) మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 17వ తేదీ శుక్రవారం నుండి 19వ తేదీ ఆదివారం వరకు నిర్వహించబడతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి తల్లాప్రగడ విశ్వేశ్వరరావు మరియు గ్రామ సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు, (ఆలయ స్థల పురాణము)ఈ దేవాలయము 12వ శతాబ్దంలో త్రేతాయుగంలో లింగప్రతిష్ట జరపబడినదిగా చెప్పవచ్చు , ఈ భూమి చుట్టూ ప్రక్కనల నూరు లింగ ప్రతిష్టలు కాగలవని ఈ ఆలయంలో నిన్ను దర్శించిన భక్తులు సర్వకోరికలు తీర్చి సర్వ దోషాలు హరింప పడతాయని రామస్వామికి తెలియజేసినారు. అప్పటినుండి శ్రీ రామలింగేశ్వర స్వామిగా పేరుగాంచి తదనంతరం బలి చక్రవర్తి పరిపాలించిన దేశముగా చెప్పేదరు. అందుచే భలే రామస్వామి అనే పేరుతో భక్తులు స్వామివారిని పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రదేశానికి బలివే అని పేరు శాశ్వతమైనది. ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో పూర్వo101 ఒక్క లింగ ప్రతిష్టలు ఉండేవి. కాలక్రమేణ అవి శిథిలాలు కాగా నాలుగైదు మాత్రమే మిగిలి యున్నవి.వీటిలో ముఖ్యమైనవి శ్రీ మృత్యమల్లేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయమునకు 1కిలోమీటర్ దూరంలో తాతగుడిగా ఈ ఆలయం పిలువబడుచున్నది,శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ నాడు తాత గుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునే సాంప్రదాయం ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి వారు బలివే దేవాలయంలో పశ్చిమభి ముఖంగా సత్యోజ్యత మూర్తిగా వెలుగొందుతూ దక్షిణ కాశీగా పేరుగాంచి భక్తుల అభిష్టా0లను నెరవేరుస్తూ సకల ఐశ్వర్యములను భక్తులకు ఇచ్చు మహానుభావులుగా వెలుగుచున్నారు, ఈ దేవస్థానం 12వ దశాబ్దంలో శ్రీ మేక ప్రతాప్ అప్పారావు నూజివీడు శాసనసభ్యులు శ్రీ వారి పూర్వీకులు మేక బసవ దండనాధులు వారిచే పున0 నిర్మింప బడినదని తెలియజేసినారు, అన్ని జిల్లాల నుండి సుమారు పది లక్షల వరకు భక్తులు రాకపోకలు కొనసాగిస్తారని తెలిపారు. 15 మీటర్ల వెడల్పు 15 మీటర్ల పొడవు వంతెన భక్తుల రాకపోకల సౌకర్యర్థం ఏర్పాటు చేసినట్లు తెలిపారు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా పోలీస్ పికెట్ , మెడికల్ క్యాంప్, ఫైర్ సేఫ్టీ అత్యవసరమైన అన్ని ఏర్పాట్లు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో సుమారు లక్ష 50 వేల మందికి ఆలయ పరిసర వివిధ పరిసరాల్లో మజ్జిగ మంచినీరు మరియు అన్నదానం ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, రెండువేల మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారని తెలిపారు, నాగిరెడ్డి గూడెం రిజర్వాయర్ ద్వారా వాటర్ సదుపాయం ఏర్పాటు అవుతుందని తెలిపారు, జల్లు స్థానాలకు, బస చేసే భక్తుల అవసరార్థం మంచినీరు వివిధ అవసరాలకు కొరత లేకుండా ఉంటుందని తెలిపారు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు, చెన్ను రంగారావు అసిస్టెంట్ కమిషనర్ దేవదయ ధర్మదాయ శాఖ. ఏలూరు జిల్లా ఆదేశాలనుసారం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి. భక్తులు కోవిడ్ 19 నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించండి తరించండి.అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందగలరని ఆలయ కార్యనిర్వహణాధికారి, సర్పంచ్ విలేకరులకు వివరించారు.