కచ్చితంగా హెల్మెట్ ధరించాలి : ట్రాఫిక్ ఎస్ఐ బుద్ధాల
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా శిరస్త్రాణం ధరించాలని ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ బుద్దాల శ్రీనివాస్ తెలిపారు. ఏలూరులోని ముఖ్య కూడళ్ళు వద్ద హెల్మెట్ పై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశానుసారం ఏలూరు డి.ఎస్.పి పైడేశ్వరరావు నేతృత్వంలో ఏలూరు ట్రాఫిక్ సిఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ లో హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వారికి హెల్మెట్ పై అవగాహన కల్పించి వారి చేత హెల్మెట్ ను కొనుగోలు చేయించి ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా యువతకు హెల్మెట్ వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగిందన్నారు ద్విచక్ర వాహనదారులు అతివేగంగా వెళ్లకూడదని నిదానమే ప్రధానమని సూచించడం జరిగిందన్నారు. బాధ్యతగా హెల్మెట్ ధరిస్తున్న వారిని గమనించి వారికి పుష్పగుచ్చాలు అందించి అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు శ్రీధర్, వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.