రైతు సోదరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు మండలం వేల్పనూరు మరియు రేగడ గూడూరు గ్రామాల్లో జొన్న పంట వేసిన రైతులతో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కే సునీత మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసి జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి తెలియజేయడం జరిగింది. జొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2970 ఇవ్వడం జరుగుతుందని. రైతులకు కొనుగోలు సమయంలో గోనె సంచులు, హమాలీ కర్చులు అన్ని ప్రభుత్వమే భరిస్తుందని, నేరుగా పొలం దగ్గరికే వచ్చి పంటలు కొనుగోలు చేస్తారని, కొనుగోలు చేసిన 24 గంటలలో రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లింపులు చేస్తారని తెలియజేశారు. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నాగ శివ సాయి , సుధారాణి, వ్యవసాయ సహాయకురాలు లక్ష్మీ ప్రసన్న ,ఉద్యాన సహాయకురాలు, రూప ,ఎంపీ ఓ, ముర్తుజావలి పాల్గొనడం జరిగింది.