ఆడుకుంటూనే తిరిగిరాని లోకాలకు
1 min read– విద్యార్థులు కరెంటు తీగలకు బలి
– ముందు రోజు అటహాసంగా శుభకార్య వేడుకల్లో
– ఉదయం పాఠశాలకు వెళ్లి ఉంటే ప్రాణాలు దక్కేవి
– రెండు కుటుంబాల్లో తీరని విషాదం
– ఖాదర్ ఖాన్ కొట్టాలలో అలుముకున్న విషాదఛాయలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్ ఖాన్ కొటాలలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి, ముక్కు పచ్చలారని చిన్నారులు ఆడుకుంటూ విద్యుత్ తీగలకు బలయ్యారు,ముందు రోజు గ్రామంలో జరిగిన ఒక శుభకార్యంలో ఇరువురి కుటుంబ సభ్యుల తో ఆనందంగా గడిపిన చిన్నారులు, గురువారం పాఠశాలకు వెళ్లి ఉంటే ప్రాణాలతో ఉండేవారని చిన్నారుల బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు, దీంతో ఖాదర్ ఖాన్ కొట్టాలలో విషాదఛాయలు అలుముకున్నాయి, ఈ విషాద సంఘటన పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, ఖాదర్ ఖాన్ కొట్టాలకు సంబంధించి డేరంగుల వెంకట రమణ, వెంకట లక్ష్మమ్మ, కుమారుడు వెంకట శశాంత్ కుమార్ వయస్సు (12) సంవత్సరాలు, ఓ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు, అదే గ్రామానికి చెందిన ఓర్పు వెంకట నరసయ్య, జ్యోతిల కుమారుడు మనోజ్ కుమార్ వయస్సు(4) సంవత్సరాలు అంగన్వాడి పాఠశాలకు వెళుతున్నాడు, ఈ చిన్నారులు గురువారం ఉదయం ఇంటి పైన ఆడుకుంటూ పక్కనే ఉన్న రేకుల ఇంటిపై కి వెళ్లడంతో ఆ ఇంటి పైన వెళ్లిన కరెంటు తీగలు తగిలి మృతి చెందడం జరిగిందని తెలిపారు, అయితే ఆ గ్రామంలో బుధవారం రాత్రి ఒక శుభకార్యం జరగడంతో పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నారని తెలిపారు, కాగా పిల్లల తల్లిదండ్రులు వెంకట శశాంక్ కుమార్ తండ్రి కువైట్లో ఉండగా అతని తల్లి, అలాగే మనోజ్ కుమార్ తల్లిదండ్రులు పనులకు వెళ్లడం జరిగింది అన్నారు, దీంతో పిల్లలు ఇద్దరు ఇంటి పైన ఆడుకుంటూ పక్కనే ఉన్న రేకుల పైకి వెళ్లడంతో రేకుల పైన కరెంటు మెయిన్ తీగలు తగులుకొని చిన్నారులు ఇద్దరు మృతి చెందడం జరిగిందని తెలిపారు, కాగా విద్యార్థుల మృతదేహాలను కడప రిమ్స్ తరలించి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, ఈ ఘటనపై డి.ఎస్.పి వెంకట శివారెడ్డి, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది, కాగా మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు, దీంతో గ్రామంలో ఒకేసారి ఇద్దరు చిన్నారులు విద్యుత్ ఘాతానికి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి .