ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
1 min read– రక్తహీనత ఉన్న గర్భవతుల పై ప్రత్యేక శ్రద్ధ
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే కాకుండా, రక్తహీనత ఉన్న గర్భవతులు, అలాగే ప్రమాద సంకేతాలు ఉన్న గర్భవతులపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు, శుక్రవారం అయిన స్థానిక గ్రామ సచివాలయం-1 పరిధిలో పర్యవేక్షించి అక్కడి గర్భవతులను, బాలింతలను వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు, అలాగే వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని ఇందులో ప్రతి ఇంటిలో నిలువ ఉన్న నీటిని తొలగించి మరల మంచినీరు నిలువ ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన వైద్య సిబ్బందికి సూచించారు, అంతేకాకుండా ఇంటి పరిసరాలలో పేరుకుపోయిన చెత్తాచెదారం లేకుండా, ఎక్కడైనా నీటి గుంటలు ఉంటే వాటిని పూడ్చి వేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన తెలియజేశారు, ఈ చెత్తాచెదారం వల్ల దోమలు చేరడం తద్వారా డెంగ్యూ, ఏరియా వంటి వాటికి కారణం అవుతున్నాయని వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు దోమతెరలు తప్పకుండా వాడాలని ఆయన సూచించారు, ప్రతి శుక్రవారం డ్రై డే గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య అధికారులు దీనిపై చొరవ చూపాలని ఆయన వైద్య సిబ్బందికి తెలియజేశారు, గ్రామాలలో జ్వర పీడితులను గుర్తించి వారికి సకాలంలో తగు వైద్య సేవ లతోపాటు, తగినటువంటి సలహాలు అందజేయాలని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా రా రక్తహీనత ఉన్న గర్భవతులు, అదేవిధంగా ప్రమాద సంకేతాలు ఉన్న గర్భవతులను నిరంతరము పర్యవేక్షించి వారికి తగిన సహాయ సహకారాలు అందించాలని ఆయన తెలియజేశారు, అనంతరం పీహెచ్సీలోని రికార్డులను పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు, ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, సహాయక మలేరియాఅధికారి వెంకటరెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ లక్ష్మయ్య, ఎం పి హెచ్ ఈ ఓ ప్రసాద్, వైద్య సిబ్బంది , ఆశా వర్కర్లు పాల్గొన్నారు.