నేటి నుండి ఉరుసు మహోత్సవాలు
1 min read– నేడు గంధం మహోత్సవం
– రేపు ఉరుసు మహోత్సవం
– ఉత్సవాలకు ముస్తాబైన శ్రీశ్రీశ్రీ మహాత్మ బడే సాహెబ్ తాత దర్గా
– ఉరుసుకు వచ్చే భక్తులకు భోజనం,వసతి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు
– ఉరుసులో ఆకతాయిలు అల్లర్లు సృష్టిస్తే అలాంటి వారిని పోలీసులకు అప్పగిస్తాం: దర్గా వంశపారంపర్య పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముద్గోల్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు మహాత్మా గంజిహల్లి బడే సాహెబ్ తాత ఉరుసు మహోత్సవ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ మహాత్మ బడేసాహెబ్ దర్గా వంశపారంపర్య పీఠాధిపతులు ముద్గోల్, బాబు సాహెబ్, ఇమామ్ సాహెబ్ ఆధ్వర్యంలో జరుగుతుందని దర్గా ధర్మకర్త ఆర్. కుబేర రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ బాషా, బడేసాహెబ్, దర్గా వంశపారంపర్య పీఠాధిపతులు ముద్గోల్ తెలిపారు. ఈ సందర్భంగా దర్గా వంశపారంపర్య ధిపతులు ముద్గోల్ మాట్లాడుతూ గంజహళ్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ ఉరుసు మహోత్సవాల లో భాగంగా నేడు(శనివారం) గంధం , రేపు(ఆదివారం) ఉరుసు , 27వ తేదీ సోమవారం జియారత్ నిర్వహిస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఉరుసు సందర్భంగా దర్గాకు వచ్చే భక్తులకు త్రాగునీరు, వసతి, ఉచిత భోజనం, చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కావున భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తమ కోరికలను తీర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ ఉరుసు మహోత్సవంలో పెద్ద ఎత్తున జరుగుతుందని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కావున భక్తులు ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఉరుసులో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన, అల్లర్లు సృష్టించిన, ఆకతాయిలు అల్లరి చేష్టలు చేసిన అలాంటి వారిని పోలీసులకు అప్పగిస్తామని అన్నారు.