కుష్ఠు వ్యాధి సోకి న వారు సకాలంలో మందులు వాడాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: శుక్రవారం డాక్టర్ బాలాజీ జిల్లా కుష్ఠు మరియు ఎయిడ్స్ , టీబీ. అధికారి అధ్యక్షతన నంద్యాల పట్టణంలోని హరిజనవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డెమెన్ ఫౌండేషన్ ఇండియా ట్రస్ట్ (DFIT ) వారి సహకారంతో జిల్లాలో కుష్ఠు వ్యాధి సోకి అంగవైకల్యం ఏర్పడిన వారికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ DFIT ఆసుపత్రి నెల్లూరు నందు రీ కంస్ట్రక్షన్ సర్జరీ చేయడం కోసం స్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సందర్బంగా. డాక్టర్ బాలాజీ గారు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి సోకి న వారు సకాలంలో గుర్తించు కొని మందులు తినక పోవడం వల్ల వ్యాధి ముదిరి నరాలకు సోకడం వల్ల అంగవైకల్యం ఏర్పడుతుందని కావున వ్యాధి సోకినవారు ప్రాథమిక దశ లోనే మందులు తినాలని కోరారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ .సభ ,అర్బన్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ,DFIT సిబ్బంది S .సతీష్. ప్రోగ్రాం మేనేజర్, Mr. పీటర్ ఫిజియోథెరపిస్ట్. T .విజయకుమార్ పారామెడికల్ ఆఫీసర్ ,వై .గంగాధర్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ,T . చంద్రశేఖర్ రెడ్డి ,DPMO .ఇతర వైద్య సిబ్బంది పాల్కొన్నారు .