విజ్ఞాన పీఠం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
1 min read– సేవ ద్వారానే బుడుగు,బలహీన వర్గాలను చేరగలం
– విశ్వహిందూపరిషత్ కేంద్రీయ కార్యకారిణీ సభ్యులు వై. రాఘవులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: “హిందూ సమాజం కోసం పోరాడే విశ్వహిందూ పరిషత్ లో సేవావిభాగం ప్రముఖమైనది ,అందులో అనాథ శరణాలయాల మరియు విద్యాలయాల నిర్వహణ యింకా ప్రధానమైనదని” విశ్వహిందూ పరిషత్ అఖిలభారత కార్యా కారిణి సభ్యులు శ్రీ వై.రాఘవులుగారు అన్నారు. 2023 ఫిబ్రవరి 25వ తేదీ కర్నూలు శివారు జి.పి.ఆర్ నగర్ లోని విజ్ఞాన పీఠంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహాసమ్మేళనం లో ముఖ్యవక్తగా శ్రీ రాఘవులు గారు మాట్లాడుతూ గడచిన 49 సంవత్సరాలలో వేలమంది బాలురకు ఆహార, వసతి, విద్య ,వైద్య సదుపాయాలు అందించి వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా తయారు చేసిన ఘనత ఈ విజ్ఞాన పీఠం చెందిందని కూడా తెలిపారు. మరో ముఖ్య వక్తగా విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ నివాస రెడ్డి గారు మాట్లాడుతూ “ఈ పాఠశాలలో కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థులకు జాతీయ శీలం, వ్యక్తిత్వం, సామాజిక స్పృహ వంటి అనేక అంశాలలో తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతుందని” చెప్పారు. “49 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజ్ఞాన పీఠం మరో అడుగు ముందుకు వేస్తూ ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేటు పాఠశాలలను ప్రారంభించాలని యోజన చేస్తున్నదని “విజ్ఞాన పీఠం కరస్పాండెంట్ కార్యదర్శి శ్రీ పిపీ గురుమూర్తిగారు తెలిపారు . విజ్ఞాన పీఠం పూర్వ విద్యార్థులలో అటు అరక్షిత శిశు మందిరంలో, ఇటు కేవలం పాఠశాలలో చదివే విద్యార్థులను రెండు భాగాలుగా చేసి సమావేశం నిర్వహించడం జరిగింది. వందలాది విద్యార్థులు వారి వారి అనుభవాలను పంచుకుంటూ ఆనందంగా పాలుపంచుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులైన లలిత కళా సమితి అధ్యక్షులైన శ్రీ పత్తి ఓబులయ్య గారికి, శ్రీ రామ గోవిందప్ప గారికి ,శ్రీ వి సుబ్రహ్మణ్యం గారికి సన్మానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వీ.హెచ్.పీ.జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ,నగర అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి డాక్టర్ రామకృష్ణయ్య, సుదర్శన్ రావు, రణధీర్ రెడ్డి ,చంద్రమోహన్, ఎస్ రామిరెడ్డి, శ్రీమతి స్వర్ణలత , నాగిరెడ్డి ,రాజశేఖర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సోమయ్య, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.