యాంత్రికరణ కింద మండలానికి కోటి 35 లక్షలు మంజూరు
1 min read– ఏం హేమ సుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలానికి యాంత్రికరణ కింద కోటి 35 లక్షల రూపాయలు 40 శాతం రాయితీ కింద గడివేముల మండలంలోని మొత్తం 14 ఆర్ బి కే ల కు మంజూరైనట్టు ఆదివారం నాడు మండల వ్యవసాయ అధికారి రెడ్డి తెలిపారు. అందులో యాంత్రికరణ (సి హెచ్ సి) కింద మొదటి విడతలో ఐదు గ్రామాలైనటువంటి బూజునూరు, గడిగరేవుల, గడివేముల, కరిమద్దెల., గని .రాయితీ పొందినట్టు తెలిపారు. ప్రతి ఒక్క మిగిలిన ఆర్బికేల యందు ఒక్కొక్క ఆర్బీకేకి 15 లక్షల రూపాయల విలువగల పనిముట్లు అయినటువంటి రోటవేటర్, విత్తనం గొర్రు, పెద్ద ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ ,తైవాన్ స్ప్రేయర్లు , ట్రాక్టర్ పంపు స్ప్రేయరు తీసుకునే దానికి అవకాశం ఇచ్చారు . మార్చి 5వ తారీఖు చివరి తేదీ . కనుక మిగతా 9 ఆర్బికేల రైతు సోదరులు దయచేసి పైన తెలిపిన పనిముట్లు తీసుకో దలచిన వారు గ్రూపు కింద కొటేషన్లు తీసుకొని వచ్చి అమౌంట్ మొత్తం ఒక్కొక్క గ్రామానికి 15 లక్షల రూపాయలు .అందులో సగం ఏడున్నర లక్ష రైతు చెల్లించాలి మిగతా సగం సొసైటీ బ్యాంకు వారు 7.50 లక్షల రుణంగా ఇస్తారు .సబ్సిడీ 40 శాతం. ఈ పైన తెలిపిన విషయాలను అందరూ గమనించి ఉపయోగించుకోవాల్సిందిగా మండల వ్యవసాయ అధికారి తెలిపారు.