PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగవైభవంగా జన్మదిన వేడుకలు

1 min read

– పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు
– నందికొట్కూరులో చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు
– చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు..వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాజకీయం అంటే పదవులు కాదు.. హోదా కాదు ప్రజలకు చేయబోయే సర్వీస్ .. ప్రజలకు సర్వీస్ చేస్తేనే ప్రజలు గుర్తిస్తారంటూ.. తన పవర్ ఫుల్ డైలాగ్స్‌తో యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన భారీగా అభిమానులు ఉన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు .ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానాన్ని చురగొన్న బైరెడ్డి సిద్దార్థ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏకంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్‌‌గా ఎన్నికయ్యారు.అనంతరం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు, వైసీపీనాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. సిద్దార్థ రెడ్డి జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలోని మండలాలు పగిడ్యాల ,జూపాడుబంగ్లా, మిడుతూరు, నందికొట్కూరు, నందికొట్కూరు మున్సిపాలిటీ లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సర్వమత ప్రార్థనలు చేశారు . భారీ కేక్ లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
చిరువ్యాపారులకు తోపుడు బండ్లు..
నందికొట్కూరు పట్టణంలోని చిరు వ్యాపారులకు 43 మందికి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆర్థిక సహాకారంతో పండ్ల వ్యాపారులకు తోపుడు బండ్లను మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డిల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అలాగే ఐదు మంది వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆసుపత్రిలో …వృద్దాశ్రమంలో..
నందికొట్కూరు పట్టణ ప్రభుత్వ కమ్యునిటీ హెల్త్ సెంటర్ నందు బాలింతలకు గర్భిణులకు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.అనంతరం పట్టణంలోని శ్రీ కాశీ ప్రసాద వృద్దాశ్రమంలో తత్తూరు వైసీపీలు నాయకులు నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రక్తదాన శిబిరానికి విశేష స్పందన..పగిడ్యాల గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి.వీరభద్ర స్వామి దేవస్థానంలో శాప్ బైరెడ్డి సిధార్థరెడ్డి జన్మదిన సందర్భంగా జడ్పీటిసి పుల్యాల దివ్య, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, గ్రామ సర్పంచి పేరుమాళ్ళ శేషన్న లు ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. ప్రాణదాతా స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం కార్యక్రమం విజయవంతంగా చేశారు. జూపాడుబంగ్లా మండలంలో ఎంపీపీ సువర్ణమ్మ ,జడ్పిటిసి పోచా జగదీశ్వర్ రెడ్డి , వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి మండల కన్వీనర్ కేశవరెడ్డి నాగార్జున రెడ్డిల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , మాజీ మార్కెట్ చైర్మన్ శివరామకృష్ణారెడ్డి , నంద్యాల జిల్లా షాప్ కోఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్, బ్రాహ్మణ కొట్కూరు వైసీపీ నాయకులు ఓంకార్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్, నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిలర్లు కాటేపోగు చిన్న రాజు, హమీద్ మియా, అబ్దుల్ రవూఫ్, నాయబ్, లాలు ప్రసాద్, చెరుకు సురేష్, మనపాడు అశోక్, కురువ శీను, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వి.ఆర్ శ్రీను, బ్రహ్మయ్య, పి. రమేష్, శాలి భాష, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బద్దుల శ్రీకాంత్, సప్లయర్ సత్యనారాయణ, మైనార్టీ నాయకులు అబూబకర్, బిసి నాయకులు కెవి రమణ, డి.రమేష్.సోషల్ మీడియా పట్టణ కన్వీనర్ కిషోర్, కోఆర్డినేటర్ మధు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author