PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజకవర్గ అభివృద్ధి గంగుల కుటుంబ ధ్యేయం

1 min read

– మండలి విప్ గంగుల,  ఎమ్మెల్యే గంగుల నాని చాగలమర్రి పోటో
పల్లెవెలుగు వెబ్    చాగలమర్రి : ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధే గంగుల కుటుంబీకుల ధ్యేయమని మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి లు తెలిపారు.  గురువారం చాగలమర్రి పట్టణంలోని మహబూబ్ వలి కాలనీలో గల  వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్  నిర్మించిన వైయస్సార్సీపి పట్టణ పార్టీ కార్యాలయాన్ని మండలి విప్ , ఎమ్మెల్యే నాని, రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్ గౌస్ లాజం, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు  హబీబుల్లా లు భారీ  జన సందోహం మధ్య అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన వీరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  ఘన స్వాగతం పలికారు.  మొదట వైయస్సార్సీపి జెండాను ఆవిష్కరించి , కేక్ కట్ చేసి  కార్యాలయాన్ని  కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ గౌసియా బేగం, చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తులసమ్మల ఆధ్వర్యంలో పొదుపు లక్ష్మి మహిళలు గజమాలలతో సన్మానించారు. అనంతరం మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి   లు మాట్లాడుతూ  అభివృద్ధి విషయంలో   ఉమ్మడి కర్నూలు  జిల్లాల్లో నియోజకవర్గం  ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత 35 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోని  రోడ్లన్నీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో  మహర్దశ వచ్చిందని వారు తెలిపారు . కొండంపల్లి నుండి పేరాయిపల్లి వరకు రోడ్డు పూర్తి అయిందని ఎన్నికల కోడ్ పూర్తిగానే ప్రారంభిస్తామన్నారు. చాగలమర్రిలోని మళ్లీ వేముల రస్తాలో  గుంతలతో నిండిన మార్గాన్ని సిమెంట్ రోడ్డు వేయించామన్నారు  మిగతా రోడ్డు కూడా  చాగలమర్రి నుండి రాయచోటి వరకు జాతీయ రహదారిగా ప్రతి పాదనలు  పంపారని టెండర్లు పూర్తికాగానే    పనులు ప్రారంభిస్తారని  వారు తెలిపారు.  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  అహోబిలం రోడ్డు చాలా ఏళ్ల నుండి అధ్వానంగా ఉన్న గత పాలకులు పట్టించుకోలేదని ఈ రోడ్డును  బాగు చేసి భక్తుల రాకపోకల కష్టాలు తొలగించామన్నారు. చాగలమర్రి నుండి మహాదేవపురం వరకు ఆర్ అండ్ బి రోడ్డు త్వరలో పూర్తి అవుతుందని  వారు తెలిపారు. నేలంపాడు రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు అలాగే నియోజకవర్గ పరిధిలో  జాతీయ రహదారి వెంబడి అంతర్గత రోడ్లను, వంతెనలను త్వరలో నిర్మాణ పనులను చేపడతారన్నారు .  అభివృద్ధి కళ్ళకు కనిపించని టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారని కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న చెంచుల కోసం డి.వనిపెంట చెంచుగూడెం వద్ద భవనాసి రూ 4 కోట్లతో వంతెనను ఎవరు నిర్మించారో గుర్తించాలన్నారు .వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాల ద్వారానే తిరిగి 175 స్థానాల్లో విజయ డంఖా మోగించి అధికారంలోకి  వచ్చి తీరుతామని వారు  ధీమా వ్యక్తం చేశారు .  అనంతరం వ్యయ ప్రయాసలకు   ఓడ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంతో చక్కగా నిర్మించినందుకు వారు బాబూలాల్ ను అభినందించారు.  కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షులు వీరభద్రుడు, గజ్జల రాఘవేంద్ర రెడ్డి, అమర్నాథరెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి , జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ,  మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ,ఉప మండల అధ్యక్షుడు ముల్లా రఫీ , మండల కోఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం, ఎంపీటీసీలు పత్తి నారాయణ, ఫయాజ్, లక్ష్మి రెడ్డి , సర్పంచులు  దస్తగిరి రెడ్డి, గోవిందయ్య, మౌళి, ప్రతాపరెడ్డి , సింగల్ విండో అధ్యక్షుడు దస్తగిరి , మాజీ జెడ్పిటిసి రామగురిగిరెడ్డి, సాగునీటి సంఘ అధ్యక్షుడు శేషు రమేష్,  వైసీపీ నాయకులు  వెంకటసుబ్బారెడ్డి, పుల్లయ్య, బియ్యం షబ్బీర్, గౌస్ పీరా, వెంకటేశ్వర్ రెడ్డి, చక్రం  ముల్లా షబ్బీర్ ,  ముల్లా ఖాదర్బాషా , అబ్దుల్లా, నాయబ్ రసూల్, గేట్ల మాబు, అబ్దుల్లా భాష, నూర్ భాషా, దాదా బీడీ  ఖాజా, ఆర్ఎస్ రమణ,  బచ్చు సుబ్రహ్మణ్యం,  మెడికల్ స్టోర్ నాగేంద్ర, ఐడియా బాబు, వేణు, లక్ష్మిరెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు .

About Author