ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం
1 min read– హెచ్.తిమ్మన్న ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల యొక్క హక్కులను ఈ ప్రభుత్వం కాల రాస్తుందని, మేము ఆగ్రహిస్తే ప్రభుత్వాల ఉనికికే ప్రమాదం వస్తుందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న హెచ్చరించారు. ఈ మేరకు తేదీ 05-03-2023 న కర్నూల్ నగరం నందిని సలాం ఖాన్ ఎస్టియు భవనం నందు ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీకే జనార్దన్ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ముదసిర్ అహ్మద్ ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ జిల్లా కన్వీనర్ జి .నాగరాజు, శాంతమూర్తి, నాయకులు వై .వి .భాస్కర్ శేఖర్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రావలసినటువంటి పదకొండవ పిఆర్సి బకాయిలు 1800 కోట్లు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగులకు రావలసినటువంటి నాలుగు విడుదల కరువు బత్యం తక్షణం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకుంటున్నటువంటి భవిష్య నిధి జీవిత బీమా సంపాదిత సెలవు నగదీకరణ మెడికల్ రీయంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులన్నీ తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఈ సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి 12వ పిఆర్సి అమలు చేయాల్సి ఉందని తక్షణం 50 శాతం మధ్యంతర భృతి ప్రకటించి పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు నిర్వహించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వేసవి సెలవుల్లో ప్రభుత్వం చెప్పినటువంటి 34 వేల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు బదిలీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ జీతాలు పదోన్నతులు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 84 పూర్తిస్థాయిలో అమలు చేయాలని తక్షణమే వారికి భవిష్యనిధి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు . ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రెన్యువల్ సౌకర్యాన్ని మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పెంచాలని తక్షణం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జీవిత బీమా భవిష్య నిధి సౌకర్యాలు కల్పించి కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుసుగా కత్తి నరసింహారెడ్డి గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోతుల నాగరాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అభ్యర్థులు అనేక ప్రలోభాలకు అక్రమాలకు పాల్పడుతు న్నారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.