రాయలసీమ ద్రోహి సీఎం జగన్
1 min read– వైసీపీ-టీడీపీ కుటుంబపార్టీలే..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అట్టర్ ప్లాప్.కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు..
– రాష్ట్ర అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్ విమర్శించారు.కేంద్ర పథకాలకు వైసీపీ తమ స్టిక్కర్లు వేసుకుంటుందన్నారు.శనివారం నందికొట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహంలో బీజేవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పట్టబద్రుల అభ్యర్థి రాఘవేంద్ర నగనూరు ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాయలసీమ ద్రోహి సీఎం జగన్..
రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన టిడిపి, వైసిపి ప్రభుత్వం ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశాయి.కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిలో తమ స్టిక్కర్లను చేసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ తన స్టిక్కర్ వేసుకుని తామే అమలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం జగన్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారిన ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదని శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రులను అందించిన రాయలసీమ అభివృద్ధిని విస్మరించారన్నారు.రాయలసీమ ప్రాంతం తాగు సాగునీటి కష్టాలతో విలవిలాడుతోందన్నారు. రాయలసీమ రైతాంగానికి నీటి కష్టాలు తీరలేదన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు .రాయలసీమ ద్రోహిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు.
జగన్ వస్తే జాబన్నారు.. మరీ జాబ్ ఎక్కడ..?
జగన్ వస్తే జాబు వస్తుందన్నారు..మరీ జాబ్ ఎక్కడ జగన్ అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు జాబ్ రాలేదుకానీ రాష్ట్రానికి గంజాయి వచ్చింది.. లిక్కర్ మాఫియా వచ్చింది.. అవినీతి మాఫియా వచ్చింది.. నవరత్నాలలో రత్నం లేదు మట్టి ఉంది..ప్రభుత్వానికి భయపడి పరిశ్రమలు రావడం లేదు.. ఉద్యోగులకు జీతాలు లేవు అని ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.రాష్ట్రంలో వైసీపీ ప్రమాదకరమైందని విమర్శించారు .ప్రధాని నరేంద్ర మోడీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
వైసీపీ.. టిడిపి కుటుంబ పార్టీలే..
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, టిడిపి పార్టీలు రెండు కూడా కుటుంబ పార్టీలే .. అవినీతి చేసిన పార్టీలే.. వీటికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ చేసే అభివృద్ధిని ఆధారంగా రాష్ట్రంలో బలపడాలని స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయి..
రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పూర్తిగా వైపల్యం చెందిందని ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విసిగిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని స్పష్టంగా చెబుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలతో సమానంగా, గత ప్రభుత్వం టిడిపి కూడా వలగాపెట్టింది ఏమీ లేదు.పేదల ఆకలి కేకలు జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని దుయ్యబట్టారు. పేదల సంక్షేమాన్ని పట్టించుకోని ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ, బీజేవైయం నాయకులు మాజీ జడ్పీటిసి నాగేశ్వరరావు, కొండెపోగు చిన్న సుంకన్న, లాయర్ మద్దిలేటి, గూడూరు రవికుమార్ రెడ్డి, గూడూరు శివప్రసాద్ రెడ్డి, కాటేపోగు చిన్న నాగన్న, కిషోర్, రాంబాబు, వెంకటేశ్వర్లు, గోకారి, డా.కరీం, కొత్తపల్లి, పాములపాడు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, నందికొట్కూరు, మిడుతూరు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.