శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఢీ వార్మింగ్ డే కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నాడు ఎన్ఎస్ఎస్ విభాగపు ఆధ్వర్యంలో డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా శ్రీ సాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగుల నివారణకు బెలడోన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ నులిపురుగుల వల్ల పిల్లల్లో జీవన నాణ్యత తగ్గి, శారీరక ,మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని రక్తహీనత, అజీర్ణం ,వాంతులు విరోచనాలు ,కడుపునొప్పి వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయని వివరించారు. పెద్ద నులిపురుగుల వల్ల మెదడులో పక్షవాతం కూడా సోకే అవకాశం ఉందని కావున విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు మరియు చిన్న పిల్లలలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ వారు పంపిణీ చేయు ఈ మందులను తప్పనిసరిగా వినియోగించుకునేలా చైతన్యం కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, ఎన్ ఎస్ ఎస్ అధికారి కరుణాకర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.