PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వినియోగదారుల ప్రయోజనాలకు రక్షణ కల్పించాల్సిందే

1 min read

– వస్తువుల వివరణ ఇతర అవసరాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క వినియోగదారుడికి ఉంది..
– జిల్లా వినియోగదారుల ఫారం కమిషన్ సభ్యురాలు వి. శ్రీనాగలక్ష్మి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వినియోగదారుడి ప్రయోజనాన్ని పరిరక్షించి, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పాదనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కల్పించిన చట్టాలపట్ల కనీస అవగాహన కలిగి ఉండటం అందరి బాధ్యతని జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు అన్నారు.స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా వినియోగదారుల కమీషన్ సభ్యురాలు వి. శ్రీనాగలక్ష్మీ , జిల్లా వినియోగదారుల సంఘం ప్రతినిధులు కట్టా సత్యనారాయణ, కె. రామచంద్రరావు, డా. విజయకృష్ణ, తదితరులును పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్బంగా డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. సత్యనారాయణరాజు మాట్లాడుతూ మొట్టమొదటికిగా వినయోగదారుల రక్షణ చట్టం 1986లో అమల్లోకి వచ్చిందన్నారు. కాలానుగుణంగా వినియోగదారుల అవసరాలు మారుతున్న దృష్ట్యా దానికి అనుగుణంగా ఆ చట్టంలో ఉన్న లోటుపాట్లను సమీక్షించి దానిస్ధానే కొత్తగా వినియోగదారుల రక్షణ చట్టం 2019 లో ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. తద్వారా వినియోగదారులకు సాధ్యమైనంత సత్వర న్యాయాన్ని అందించడానికి వీలైయిందన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడంలో ఎప్పుడూ పౌర సరఫరాల శాఖ సంసిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా వినియోగదారుల కమీషన్ సభ్యురాలు వి. శ్రీనాగలక్ష్మీ మాట్లాడుతూ వస్తువుల నాణ్యత ఇతర వివరాలను తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉందన్నారు. ఏదైనా ప్రమాదంలో ఇంటి యజమాని మరణించినట్లయితే కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చన్నారు. వినియోగదారుల అకౌంట్ నుంచి సంవత్సరానికి ఒకసారి రూ.436 బ్యాంకు ఖాతా నుంచి జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి పలు పథకాలపై వినియోగదారుల అవగాహన ఎంతో అవసరం అన్నారు. అదే విధంగా వంటగ్యాస్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించినా, ఆస్దినష్టం జరిగినా భీమా నష్టపరిహారం అందుతుందని వివరించారు. వార్షిక ఆదాయం తక్కువఉన్న వారు విద్యా అడ్వాన్స్ తీసుకున్న సమయంలో వడ్డీ రాయితీ గురించి ముందస్తుగా బ్యాంకర్లను అగిడితెలుసుకోవాలన్నారు. బ్యాంకుకు సంబంధించిన ఖాతా నెంబరు, పిన్, ఓటిపి వంటి సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదని ఆమె సూచించారు. జిల్లా వినియోగదారుల సంఘం ప్రతినిధులు కట్టా సత్యనారాయణ, కె. రామచంద్రరావు, డా. విజయకృష్ణ తదితరులు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టంలోని పలు అంశాలను వివరించారు. వినియోగదారుల్లో ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో అప్పుడే వస్తు సేవల నాణ్యత పెరుగుతుందన్నారు. వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చన్నారు. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందన్నారు. వినియోగదారుల్లో చైతన్యం ఉన్నప్పుడే ప్రశ్నించడం జరుగుతుందని అన్నారు. ఇందుకు వినియోగదారుల హక్కులపై అవగాహన ఉంటేనే ఈ చైతన్యం కలుగుతుందన్నారు. ఈ సందర్బంగా తూనికలు కొలతలు శాఖ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖ డిసిటిఓ జే శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్ స్పేక్టర్ డి. సునీత, పుడ్ సేప్టీ ఆఫీసరు కె. రామరాజు, ఎపిఇపిడిసిఎల్ డిప్యూటీ డిఇ ప్రసాద్, తదితరులు వినియోగదారుల పరిరక్షణకు కల్పించబడిన పలు అంశాలను వివరించారు. వంటగ్యాస్ సరఫరాకు సంబంధించిన సమస్యలను 1906 నెంబరుకు, విద్యుత్ సమస్యలను విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక 1912 కాల్ సెంటరుకు తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డా. డి. ఆశ, పౌర సరఫరాల జిల్లా మేనేజరు మంజూభార్గవి, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ కె. వెంకటేశ్వరరావు, ఎల్ డిఎం ఎస్.ఎస్. ఎ వెంకటేశ్వరరావు, జిల్లా రెడ్ క్రాస్ సంస్ధ కార్యదర్శి బి. బెన్నీ, తదితరుల పాల్గొన్నారు.

About Author