కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం..
1 min read– వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డా.మధుసూదన్ గెలుపు..
– అల్లూరు గ్రామంలో వైసీపీ శ్రేణులు సంబరాలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎమ్మెల్సీ ఎన్నికలలో డా. అలంపూర్ మధుసూదన్ నాయుడు గెలుపొందిన సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. వైసిపి అభ్యర్థి డా.అలంపూర్ మధుసూదన్ నాయుడు స్వతంత్ర అభ్యర్థులపై గెలుపొందారు. మొత్తం 1138 ఓట్లు పోలుకాగా 53 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 1083 ఓట్లలో వైసిపి అభ్యర్థి మధుసూదన్ నాయుడు కు 988 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి మోహన్ రెడ్డికి 85 ఓట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి భూమా వెంకట వేణు గోపాల్ రెడ్డి కి 10 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఆలంపూర్ మధుసూదన్ స్వతంత్ర అభ్యర్థులపై విజయం సాధించారు.మొత్తం 1138 ఓట్లు పోలుకాగా 53 ఓట్లు తిస్కరణకు గురయ్యాయి మిగిలిన 1083 ఓట్లలో వైసీపీ అభ్యర్థి డా. ఆలంపూర్ మధుసూదన్ 988 ఓట్లతో విజయం సాధించారు.ఆయన విజయాన్ని ధ్రువీకరిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. వాల్మీకి బోయలకి సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్సీ పదవి వాల్మీకి బోయలకి కేటాయించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగనన్న కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్సీ డా.మధుసూదన్ నాయుడు సొంత గ్రామమైన నందికొట్కూరు మండలం అల్లూరులో ఆయన ఆత్మీయులు, బంధువులు, వైసీపీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు అలంపూర్ రవీంద్ర నాయుడు స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కి వైసీపీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.అల్లూరు గ్రామానికి చెందిన పాపన్న, రామ నాయుడు,సయ్యద్ బాష, , తదితరులు ఎమ్మెల్సీ ని పూల మాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మా గ్రామానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్సీగా విజయం సాధించడం మా గ్రామానికి గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.