శ్రీ చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
1 min read22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారధి ,జ్యోతి, రథ,వసంతోత్సవం ఉత్సవాలు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి రాయబారధి జ్యోతి,రథ, వసంతోత్సవములు ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నందవరం చౌడేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి వీఎల్ఎన్ రామానుజన్, ఆలయ సిబ్బంది, మండలంలోని అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగానందవరంచౌడేశ్వరిదేవిమహోత్సవాలు విజయవంతంగా జరుపుకోవాలని గ్రామ పంచాయతీ శాఖ అధికారుల పాత్ర కీలకమని కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జ్యోతిమహోత్సవాలను విజయవంతంచేయాలనిఅన్నిశాఖలఅధికారులతో సమీక్ష సమావేశం లో అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శాలువా కప్పి పూలమాలతో సత్కరించడం జరిగింది. చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు సందర్భంగా ఆలయ సిబ్బందికి దేవస్థానం వారి తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అందించే వస్త్రాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె మండలంలో నందవరం గ్రామంలో స్వయంగా కాశీ విశాలాక్షి అమ్మవారు చౌడేశ్వరి దేవి అలంకారంలో ఇక్కడ దర్శనమిస్తుందనిఇక్కడఅమ్మవారినిదర్శించుకోవడానికి కర్నూలు, కడప అనంతపురం జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ హాజరు కావడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ముఖ్యంగా మంచినీటి వసతి, ఎలక్ట్రిసిటీ , పోలీసులు అలాగే భక్తుల రాకపోకలకు ఆర్టీసీ శాఖ ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వారి ఆరోగ్యం కొరకు మెడికల్ సిబ్బంది చాలా జాగ్రత్తగా తమ విధులు నిర్వర్తించి ఉత్సవాలను దిగ్విజయం చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో ఇక్కడ భక్తులు హాజరు కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ సుబ్బరాయుడు ఆదేశించడం జరిగింది. అలాగే మండల అభివృద్ధి అధికారి శివరామయ్య గారితో పారిశుద్ధ పనుల మీద గ్రామ పంచాయతీ అధికారులతో ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని జ్యోతి మహోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈనెల 22వ తేదీన గణపతి పూజ పుణ్యాహవాచన, అంకురార్పణ, పంచాంగ శ్రవణంతో మొదలయ్యి సాయంత్రం పన్నేరపు బండ్లు త్రిప్పుట, 23వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం కార్యక్రమం అలాగే అదే రోజు రాత్రి 10:00 నుండి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించడం జరుగుతుందని, 24వ తేదీ ఉదయం అమ్మవారికి కుంకుమార్చనతో మొదలయ్యి సాయంత్రం నాలుగు గంటల నుండి అమ్మవారి రాయబార మహోత్సవము నిర్వహించడం జరుగుతుందని, 25వ తేదీన శనివారం ఉదయం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన పసుపు కుంకుమ పట్టు వస్త్రాల అలంకరణతో మొదలయ్యి రాత్రి 12 గంటలకు శ్రీ భాస్కరయ్య ఆచారి గారిచే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టడం జరుగుతుందని అదే రోజు రాత్రి ఒంటిగంట నుండి చౌడేశ్వరి దేవి అమ్మవారి మహోత్సవం లో ప్రధాన ఘట్టమైన శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, 26వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి రథోత్సవము పోవడము, 27వ తేదీన అమ్మవారి రథోత్సవము రావడము, 28వ తేదీన ఉదయం ఏడు గంటలకు వసంతోత్సవంతో అమ్మవారి జ్యోతి మహోత్సవములు ముగుస్థాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందవరం చౌడేశ్వరి దేవి పాలకమండలి మాజీ చైర్మన్ పి ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆలయ ప్రధాన కార్యనిర్వహణ అధికారి వీఎల్ఎన్ రామానుజన్, బనగానపల్లి మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు ,నందివర్గం ఎస్సై రామాంజనేయులు రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజనీరు సాయి కృష్ణ, విద్యుత్ రూరల్ అసిస్టెంట్ ఇంజనీర్ గజ్జప్ప, ఆర్టీసీ డిపో మేనేజర్ , మెడికల్ ఆఫీసర్, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.